సాధారణంగా భారత దేశంలో జీఎస్టీ విధించిన తర్వాత అది తినే వస్తువులపై కూడా జీఎస్టీ పడుతుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల హర్ష్ రెస్టారెంట్ కు వెళ్లి అప్పడాలు ఆర్డర్ చేయడంతో , ఆయనకు గుండ్రటి అప్పడాల పైన ఎటువంటి జీఎస్టీ పడలేదట. కానీ చతురస్రాకారంలో ఉన్న అప్పడాల పై జీఎస్టీ వేశారని ఆయన ఇలా స్పందించాడు..

హర్ష్ గోయెంజా  తన ట్విట్టర్ ద్వారా.. ఒక రౌండ్ అప్పడానికి  GST నుండి మినహాయింపు ఇచ్చారు. కానీ ఒక చదరపు అప్పడానికి మాత్రం  GST ని వేస్తున్నారు అని మీకు తెలుసా? నాకు ఈ చిన్న లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్‌ ఎవరైనా వుంటే నాకు  సూచించగలరా? ” అంటూ హర్ష్ గోయెంకా..ఆ రెండు ఆకారాల అప్పడాల ఫోటోలను పోస్ట్ చేస్తూ..కింద ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది.ఇకపోతే ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది.

హార్ష్ గోయెంక ట్వీట్ చేసిన కొద్ది సమయానికే ..ఆయన ప్రశ్నకు CBIC ట్విట్టర్‌లోనే సమాధానమిస్తూ “ అప్పడాన్ని  ఏ పేరుతో పిలిచినా , GST నోటిఫికేషన్ నెం .26/2017-CT (R) లోని GST నంబర్ 96 నుండి మినహాయించబడింది. ఈ GST అనేది అప్పడాన్ని  ఆకారాన్ని బట్టి వేరు చేయదు. " సెంట్రల్ బోర్డ్ యొక్క పరోక్ష పన్నులు అలాగే  కస్టమ్స్ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉందని కూడా CBIC తెలిపింది.

ఇకపోతే అప్పడానికి కూడా ఆకారాన్ని బట్టి జిఎస్టి వేస్తున్నారు అని తెలియడంతో , ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు . అంటే కొంతమంది ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా ఉందో అని సూచిస్తుంటే మరికొంతమంది ఇలాగా అప్పడాల ఆకారాన్ని బట్టి జిఎస్టి వేస్తారు అనేది ఇదే మొదటిసారి.. అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఇక ఈ విషయం కొత్తగా అనిపించింది కాబట్టే, అతి కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: