సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన కొన్ని రకాల ఘటనలు క్షణాలు వ్యవధిలో  అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి. దీంతో ఇంట్లో కూర్చుని అన్ని విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాడు మనిషి.  ఈ క్రమంలోనే ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో సాహసోపేతమైన వీడియోలు కూడా ఎంతో మందిని అబ్బుర పరుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో సైనికులు కొన్ని కొన్ని సార్లు చేసే సాహసాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ సైనికులు చేసిన సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినప్పటికీ సైనికులు మాత్రం ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అది కూడా ఏకంగా 12 వేల అడుగుల ఎత్తులో ఈ సాహసం చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లో మీలం వద్ద  నదిని దాటే క్రమంలో నలుగురు స్థానికులు  అక్కడే చిక్కుకుపోయారు.



 ఈ క్రమంలోనే ఐటీబీపీ  సిబ్బంది అటువైపుగా వెళుతుండగా ఇక నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానికులు అక్కడ ఇరుక్కుపోయి నట్లు గమనించారు. అయితే దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో పర్వతసానువుల మధ్య నది ఎంతో ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏమాత్రం తేడా జరిగినా ఏకంగా ప్రాణాలకు హాని జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏకంగా ఐటీబీపీ సిబ్బంది ఎంతో సాహసం చేశారు స్థానికులను కాపాడేందుకు ఏకంగా రోప్ సహాయం తీసుకున్నారు. రోప్ సహాయంతో  అక్కడ ఇరుక్కుపోయిన నలుగురిని రక్షించారు. ఇక ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: