ఇప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులను చాలానే చూస్తున్నాము. దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ నిరుద్యోగులకు ఒక పెద్ద శుభవార్త తెలిపింది. మొత్తంగా నిరుద్యోగులకు కొంత ఊరట వచ్చిందని చెప్పవచ్చు.


ఇకపోతే ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశం అంతటా ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్ణయించుకుంది .ప్రపంచ వ్యాప్తంగా 55 వేల మందిని తన సంస్థలో నియమించుకోవడానికి సిద్ధం చేసుకుంటోంది.. సెప్టెంబర్ 16వ తేదీన తొలి జాబ్ మేళాను నిర్వహిస్తామని అమెజాన్ అధికారులు వెల్లడించారు.. ఆన్లైన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది.. దేశంలో మొత్తం 35 నగరాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సమాచారం.

నగరాలు అనగా అమృత్సర్, హైదరాబాద్, ముంబై, గుర్గావ్, కోల్ కత్తా , చెన్నై, నోయిడా, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్ ,లుధియానా, పూణే , సూరత్, కోయంబత్తూర్ వంటి నగరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో టెక్నాలజీ ,కస్టమర్ ,సర్వీస్ ఆపరేషన్, కార్పొరేట్ ఆఫీస్ వంటి పలు విభాగాల్లో ఉద్యోగాల నియామకాలు చేయడానికి సిద్ధమవుతోంది. అమెజాన్ సీఈఓ ఆంటీ జాసీ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ  ప్రకారం ఆసక్తికర అంశాలను.. ఉద్యోగాల భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇప్పటికే అటు పరోక్షంగా,ఇటు  ప్రత్యక్షంగా సుమారుగా పది లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు అందించారు.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇటలీ, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్ లలో నియామకాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే నెలల్లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం..

మిగతా దేశాల్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సీఈఓ వెల్లడించారు. అమెరికాలోని ఏకంగా 40 వేలు ఉద్యోగాలలో నియామకాలు జరుగనున్నట్లు ఆయన వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: