పెళ్లి చేసుకొని కలకాలం కలసి మెలసి జీవితాన్ని గడపవలసి భార్యను అతి కిరాతకముగా హతమార్చాడు ఓ పాపిష్టి అనుమానపు భర్త. పురాణాల్లో ఓ నానుడి ఉంది భార్య రూపవతి శత్రువు అని. అందమైన భార్యను పెళ్లాడాడు బెంగుళూరుకు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారస్తుడు. పేరుకు  తగ్గట్టుగానే అతని వేరు బీఆర్.కాంత రాజు వయసు 40 సంవత్సరాలు. అతని భార్య పేరు రూప. పేరుకు తగ్గట్టు రూపవతి వయసు 32 . ఫైనాన్స్ వ్యాపారం కోసం బయటకి వెళ్తున్న కాంతారాజుకు అందంగా ఉన్న భార్య పై అనుమానం వచ్చింది. నిజంగా ఆమె మంచిగా ఉంటుందా లేక వేరే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా అని ఆలోచింపసాగాడు కాంతారాజు. అతని అనుమానం ఒకానొక సమయంలో హద్దులు దాటింది . 
IHG


తన భార్యను చూసినప్పుడల్లా అనుమానంతో రగిలిపోయేవాడు. చివరకు ఆ అనుమానాన్ని మిన్డనుండి తొలగించు కోవడానికి ఏకంగా భార్యను చంపడానికి పన్నాగం పన్నాడు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండు కన్నడ క్రైం సినిమాలను చూసాడు . చూసినదే తడవుగా అతని మదిలో రెండు ప్లాన్ లు వచ్చాయి ...ప్లాన్ ఏ..  ఏదైనా టూర్ కి తీసుకెళ్లి ఎత్తైన కొండా పై నుండి తోసి చంపడం ..ప్లాన్ బి.. తన భార్యను కారులో ఉంచి రెండు కార్లను ఎదురెదురు ఢీ కొట్టించి చంపడం... అనుకున్నదే తడవుగా ఆ రెండు ప్లాన్ లను అమలు పరచాడు కానీ అనుకున్నది సాధించలేక పోయాడు. ఈ విషయం బయటపడకుండా కొన్నాళ్ళు సైలెంట్ అయ్యాడు ...ఆతరువాత కొన్నాళ్ళకు బంధువులతో కలసి టూర్ ప్లాన్ చేసాడు...ఆ పార్టీ లో తన భార్య ఓ ఇద్దరు మగవాళ్ళతో చిందులు వేయడంతో ఉక్రోషాన్ని ఆపుకోలేక పోయాడు. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. 


రూప మాత్రం తనతో డాన్స్ వేసిన వాళ్ళు చాల మంచి వారని తనకు అలంటి ఉద్దేశం లేదని తనను అనుమానించవద్దని వేడుకుంది ..కానీ అది నమ్మని భర్త మల్లి ఆమెను ఆ విషయమై గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఆవేశాన్ని అదుపుచేసుకోలేక స్క్రూ  డ్రైవర్ తో ఆమె గొంతులో పొడిచాడు ఆ తరువాత ఆమె గొంతు ను పదునైన కత్తితో కోసి అక్కడి నుండి పరార్ అయ్యాడు. ఆ విషయాన్నీ గ్రహించిన ఆమె మామ రూప చెల్లెలికి ఆ విషయాన్నీ ఫోన్ ద్వారా చెప్పాడు . ఆమె వెంటనే పోలీస్ లకు ఇన్ఫోర్మ్ చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. కానీ కాంత రాజు మాత్రం సెల్ ఫోన్ ఉస్ చేయకుండా చాల నేర్పుగా కొన్నిరోజులు తప్పించుకొని తిరిగాడు. ఫ్రెండ్స్ కి కాల్ చేసేవాడు పోలీసులు కనిపెడరని అక్కడినుండి వేరే చోటికి పరారు అయ్యేవాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తన ఫ్రెండ్ ని డబ్బుసహాయం కోరగా ఆటను డబ్బును ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ పోలీసులు చాకచక్యంగా కాంతారాజును పట్టుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: