జంతువులంటే కొంతమందికి మహా ప్రాణం..ఇంట్లో వ్యక్తులలాగే వాటిని పెంచుకుంటూ సపర్యలు చేస్తూ ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. వీరిని మనం జంతు ప్రేమికులు అని కూడా అనవచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది మూగజీవాలను అతి క్రూరంగా హింసిస్తున్న సంఘటనలు మనకు సోషల్ మీడియా ద్వారా బాగా తెలుస్తున్నాయి.. ఇకపోతే యాంకర్ రష్మీ లాంటి కొంతమంది సెన్సిటివ్ మనసు ఉన్న వాళ్ళు అయితే జంతువులను ఎవరైనా బాధిస్తుంటే , అది చూసి తట్టుకోలేక ఏడవడం కూడా మొదలు పెడతారు.. అంతే కాదు మొన్న ఆ మధ్య ఎవరో ఒక అర్థగంట పాటు మూగ జీవి అయిన కుక్కను అత్యంత దారుణంగా హింసిస్తుంటే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి మీద జీవించే అర్హత లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ఇకపోతే ఉన్నత న్యాయస్థానం కూడా జంతువులని హింసించే వారిపై కఠినంగా శిక్షలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఉన్నత న్యాయస్థానం తో పాటు జంతువులను హింసించే వారిపై భారీ జరిమానా విధించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది.. ఇక అంతే కాదు ఎవరైతే మూగజీవాల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారో వారు తప్పకుండా జైలు శిక్ష విధించే విధంగా ప్రస్తుత చట్టంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఉన్న చట్టప్రకారం తొలిసారిగా ఎవరైతే జంతుహింస పాల్పడతారో వారికి కేవలం 50 రూపాయలు మాత్రమే జరిమానా గా విధిస్తున్నారు. అయితే దీనిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది..

మూగజీవాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు తప్పకుండా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల ఎన్నో మూగజీవాలు తమ ప్రాణాలను కాపాడుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తాయి అని  ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే మూగజీవాలను అత్యంత దారుణంగా హింసిస్తారో అలాంటి వారికి గుణపాఠంగా భావించాలని ఎవరు కూడా మూగజీవాల జోలికి పోకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: