ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరూ టీ, కాఫీలను సేవిస్తూ ఉంటారు.మనలో ప్రతి రోజు పాలను కూడా కొంత మంది సేవిస్తూ ఉంటారు. ఇక అవి కల్తీ పాల లేదంటే ఒరిజినల్ పాలని గుర్తించడానికి మన దగ్గర ఎటువంటి పరికరాలు ఉండవు. అయితే ఇలాంటి ఉద్దేశం తోనే కొంత మంది యువకులు కేవలం ఒక స్మార్ట్ మొబైల్ ద్వారానే ఇలాంటి కల్తీ పాలను అరికట్టవచ్చు అనే విధంగా కనుగొన్నారట ఆ వివరాలు చూద్దాం.


మనం పాలు కల్తీగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే.. ఎక్కువలా డైరీలు, ల్యాబ్ లో టెస్టులు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా కల్తీ పాలను కేవలం మన మొబైల్ లోనే గుర్తించే ఒక టెక్నాలజీని కనుగొన్నారు హైదరాబాద్ యువకులు."హైదరాబాద్ పరిశోధనల అనంతరం వారు పాలల్లో కల్తీని గుర్తించడం కనుగొన్నట్లు సమాచారం. ఇది స్మార్ట్ ఫోన్ యొక్క సెన్సార్లు ఆధారంగా రూపొందించబడింది.

హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ కళాశాల విభాగంలో ఉన్న ప్రొఫెసర్ శివ గోవింద సింగ్, ఆయన అసిస్టెంట్లు సౌమ్య , శివ రామ, మిగిలిన కొంతమందితో ఇటీవల మొదటి పరిశోధన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు.. వారు ఈ పాలలోని ఉండేటువంటి ఆమ్లాన్ని కొలవడానికి ఒక సూచిక కాగితాన్ని తయారు చేశారు. అంతేకాకుండా ఆ కాగితం రంగు మార్చిన తర్వాత గుర్తించగలిగిన అటువంటి ఒక ఒక స్మార్ట్ ఫోన్ ను కూడా అభివృద్ధి చేశారు.

కేవలం మొబైల్ కొన్న ఫోన్ కెమెరా వల్ల పాలలో కల్తీ ఉందా లేదా అని గుర్తించవచ్చు. ఇక ఆ పేపర్ రంగు మార్పును కూడా అది గుర్తిస్తుంది. అంతేకాకుండా అందులో ఉండేటువంటి జున్ను శాతాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక వీరు ఉపయోగించిన వారిలో క్రోమాటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ వంటి పరికరాలను ఉపయోగించి పాలను కల్తీ గుర్తించడానికి ఉపయోగించేవారట. ఇక వీటికి పెద్దగా ఖర్చు ఉండదు అన్నట్లుగా తెలియజేస్తున్నారు ఆ పరిశోధకులు. ఇలా చేయడం వల్ల పాలను అరికట్టవచ్చు ఉన్నట్లుగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: