ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని నిరూపితం అవుతూనే ఉంది. ప్రేమ కాస్త వివాహంగా మార‌డం అనేది అద్భుత‌మైన సంఘ‌టన. ఇద్ద‌రి మ‌న‌సుల క‌ల‌యిక‌కు వివాహ బంధం శాశ్వ‌త గుర్తుని ఇస్తుంది. ప్రేమ‌కు మారు పేరు అయిన ఎంద‌రినో చ‌రిత్ర మ‌నుకు చూపిస్తోంది. ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని ఇద్ద‌రి మ‌న‌సుల మ‌ధ్య ఉన్న బంధం స‌రిపోతుంద‌ని మ‌రోసారి నిరూపిస్తూ 79 ఏళ్ల వృద్ద జంట ప్రేమ వివాహం చేసుకున్నారు.

     

   క‌రోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్‌లో కలిసిన ఇద్ధ‌రు వృద్ధ జంట వివాహ చేసుకున్నారు. వీరిద్ధ‌రి క‌థ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.  జిమ్ ఆడమ్స్ (78 సంవ‌త్స‌రాలు) మరియు ఆడ్రీ కౌట్స్ (79 స‌వంత‌రాల‌)  అనే వృద్ధ జంట ప్రేమించుకున్నారు. ఆ త‌రువాత వివాహం కూడా చేసుకున్నారు. వ‌య‌స్సు కేవలం సంఖ్య మాత్రమేన‌ని నిజమైన ప్రేమకు అవధులు లేవు అని వీళ్ల క‌థ నిరూపించింది.  క‌రోనా సమయంలో జిమ్ ఆడమ్స్ మరియు ఆడ్రీ కౌట్స్ డేటింగ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఎనిమిది నెలల  ప్రేమించుకున్న‌ తరువాత, ఈ జంట సెప్టెంబర్ 25 న వివాహం చేసుకున్నారు.



ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఓప్రా డైలీ ప్రకారం, పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్ 2017లో తన భార్యను కోల్పోయారు. మహమ్మారి సమయంలో, 78 ఏళ్ల అతను 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చేరారు. అక్కడ అతను 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. `నేను సైట్లో మొద‌టి సారిగా ఆడ్రీని చూశాను. ఆమెను కనుగొన‌డానికి ఒక రోజు మాత్ర‌మే ప‌ట్టింది.` అని జిమ్ చెప్పాడు.


జిమ్ కుమారుడు, JJ ఆడమ్స్ కూడా ట్విట్టర్‌లో వారి చిత్రాన్ని పోస్ట్ చేసారు. మరియు నెటిజన్లు తమ కథను పూర్తిగా ఇష్టపడడంతో అది వేగంగా వైరల్ గా మారింది. పోస్ట్ అప్‌లోడ్ చేయ‌డంతో  1.5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, అంద‌మైన జంట అని, మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటూ నెటిజ‌న్ ఆ జంట‌ను ఆశీర్వ‌దిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: