చెట్టు మనకు చల్లని నీడని ఇస్తుంది. తినటానికి రుచికరమైన పండ్లని ఇస్తుంది. అలాంటి చెట్లని నరకకుండా జాగ్రత్తగా చూసుకోవడం లో తప్పు లేదు. కాని చెట్టులని నరికేసే ఈరోజుల్లో దాని నిర్వహణకు లక్షలు పెట్టి ఖర్చుపెట్టడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా అయితే ఈ స్టోరీ తెలుసుకోండి.ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. అది ఏంటంటే..ఇక మన గొప్ప చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ విశ్వవిద్యాలయం కలిగిన సాంచిలోని సలామత్‌పూర్‌ కొండపైన ఈ బోధి వృక్షాన్ని నాటడం అనేది జరిగింది. ఇక ఈ చెట్టుని సెప్టెంబర్ 21 వ తేదీన 2012 వ సంవత్సరంలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు అయినా మహింద రాజపక్స నాటడం అనేది జరిగింది. ఇక అంతేగాక ఇది బౌద్ధమతంలో మంచి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్టు కాబట్టి దీనికి ప్రత్యేకంగా రక్షణ చర్యలు అనేవి బాగా చేపడుతున్నారు.

ఇక బౌద్ధ మత గ్రంథాల ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే..బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే తన జ్ఞానోదయం పొందడం అనేది జరిగింది. ఇక అలాగే అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందనే తన ఆశ్రయాన్ని పొందాడు. ఇక అందుకే ఈ బోధి చెట్టును అంత్యంత పటిష్ట భద్రత నడుమ 24 గంటలు కాపడుతున్నారు. ఇక 15 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చెట్టు చుట్టూ ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి రక్షణగా ఎప్పుడూ కూడా ఐదుగురు సెక్యూరిటీ గార్డులు 24 గంటలు ఉంటారు. ఇక ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం కూడా 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందట. కాబట్టి ఈ చెట్టును చూసేందుకు చాలా మంది పర్యాటకులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి కావడంతో.. సందర్శించే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: