క్రికెట్ చ‌రిత్ర‌లో ఇండియా పాకిస్థాన్ జట్టు ల మ‌ధ్య వ‌చ్చే మ్యాచ్ అంటే ఈ క్రేజ్ వేరే లెవ‌ల్ ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తు ఉంటారు. అయితే ఈ రెండు దే శాల మ‌ధ్య ఉన్న వివాదాల కారుణంగా ద్వైపాక్షిక సిరిస్ లు ఆడ‌టం లేదు. కానీ వీటి మ‌ధ్య మ్యాచ్ లు కేవ‌లం ఒక ఐసీసీ ట్రోఫీల‌లో ను ఉంటాయి. ఈ మ్యాచ్ ల కోసం ఇండియా, పాకిస్థాన్ అభిమానుల‌తో పాటు యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ అభిమానులు ఆత్రుత గా ఎదురు చుస్తారు. అలాగే ఈ రెండు జ‌ట్టు ల‌కు మ్యాచ్ ఉంటుంది అంటే.. ఈ రెండు దేశాల్లో ఉండే ప్ర‌జ‌లు కూడా త‌మ దేశాని ది విజ‌యం అంటే త‌మ దేశానిదే విజ‌యం అని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు ల పోరు న‌డిపిస్తారు. అయితే ఈ నెల‌లో టీ ట్వంటి ప్రపంచ క‌ప్ వేదిక‌లో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ ఉండ‌నుంది. దీంతో ఈ మ్యాచ్ కు రోజు రోజు కు ఆద‌ర‌ణ పెరిగి పోతుంది.




అయితే గ‌తంలో 2015లో వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో దాయాది పోరుకు సంబంధించి మౌక మౌక యాడ్ అనేది చాలా ఫేమ‌స్ అయింది. అప్ప‌టి నుంచి ఈ  మౌక మౌక యాడ్ అనేది ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ ప్ర‌తి సారి ప్ర‌సారం చేస్తారు. ఈ సారి కూడా ఈ మౌక మౌక యాడ్ ను స్టార్ స్పోర్ట్స్ త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో మ‌ళ్లి ఈ యాడ్ ట్రెండింగ్ లో కి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మౌక మౌక అనే యాడ్ ట్వీట్ట‌ర్ తో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇదీల ఉండ‌గా ఇండియా పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఈ నెల 24 న టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగం గా మ్యాచ్ ఉంది. ఇప్ప‌టి కే మ్యాచ్ పై ఇరు జ‌ట్టు అంచానాలు పెంచు కుంటున్నాయి. అలాగే ప్ర‌తి సారి క‌న్న ఈ సారి దాయాది పోరు ర‌స‌వ‌త్తంగా సాగే అవ‌కాశం ఉంది. టీమిండియా తో పాటు పాకిస్థాన్ కూడా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో పాటు అన్ని విధాలుగా బ‌లంగా ఉంది.  అయితే ఈ పోరు లో టీమిండియా నే విజ‌యం సాధించాల‌ని కోరు కుందాం.






మరింత సమాచారం తెలుసుకోండి: