IHG


ప్రపంచంలో కొంతమంది ప్రత్యేకమైన మనుషులు ఉంటారు. కొందరు వింతలక్షణాలతో బాధపడుతూ వుంటారు. ఇందులో కొందరు మనిషి మేధాసంపత్తిని దాటుకొని ప్రవర్తింస్తుంటారు. మొదటి కోవకి చెందిన వారిలో భయాందోళనలు, విపరీతమైన కోపం , జాలి , కరుణ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ కోవకి చెందిన ఓ మహిళ గురించి మనం చెప్పుకుందాం . ఇంగ్లండ్‌ దేశం లోని  నార్త్ యార్క్‌షైర్‌ లో నివసిస్తున్న షార్లెట్ విటిల్(34) అనే మహిళ వింత ఫోబియాతో బాధపడుతోంది. ఆమె పుట్టిన దగ్గరనుండి కనీసం కూరగాయల రుచి యెరిగి ఉండలేదట. ఎందుకంటే కూరగాయలతో వండిన వంట ఏదైనా చుస్తే వెంటనే అరచేతులు చెమటలతో తడిచిపోతాయట ఆ  వెంటనే వాంతి కూడా చేసేసుకుంటుందట.

IHG

 ఆమె పుట్టిన ఐదారు సంవత్సరాలకు కూరగాయలతో కూడిన సూప్స్ తో ఆమెకు భోజనం పెట్టినప్పుడు వెంటనే వాంతి చేసుకునేది. ఇలా ప్రతి సరి చేస్తూ ఉండడంతో ఆమెను డాక్టర్స్ దగ్గరకి తీసుకువెళ్లారు . ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు కూరగాయలతో చేసిన వంటలంటే అయిష్టంగా మారి ఆమె టెన్షన్ పడుతోంది ఆ కారణంగానే  ఆమె డిప్రెషన్ కి గురవుతోంది . తిన్న ఫుడ్ వెంటనే వాంతి చేసుకుంటుందని చెప్పారు . అయితే ఆమె చిన్న తనం నుండి కేవలం టమాటా సూప్ మరియు రైస్ కేక్ లను మాత్రమే తింటుంది. ఇతర కూరగాయల తో గాని , టమాటా సాస్ తో గాని కలిపి ఇచ్చిన వంటకం అంటే ఆమెకు అయిష్టం అని ఆమె తల్లి తండ్రులు తెలిపారు .


IHG


 అయితే ఆమె చిన్నప్పటి నుండి స్కూల్ కి వెళ్ళినా కూడా ఎవరితోనూ కలసి కూర్చొని ఆహారాన్ని తినేది కాదు. కాలేజీ రోజులు కూడా అలాగే గడచిపోయాయి. ఓ ఇంటర్వ్యూ లో జాబ్ సంపాదించింది. ఆఫీస్ లో పని చేయడనికి  ఇల్లువదిలి పట్టణానికి చేరింది. ఆ ఆఫీసులో భోజనం ఆఫీస్ స్టాఫ్ వండి వడ్డన చేసేవాళ్ళు. వారు  పెట్టిన భోజనం చూసినప్పుడు ఆమెలో మళ్లీ బయన్దోళనలు మోదలైయ్యాయి. ఇక తన ఫోబియా గురించి ఆఫీస్ లో చెప్పేయాలనుకుంది . ఒకరోజు దర్యం చేసి అందరి ముందు తన కున్న జబ్బు గురించి చెప్పింది. ఇకపై తన వంటను ఇంటినుండి తెచుకుంటానని చెప్పింది. తనకున్న ఈ భయం నుండి తప్పకుండా బయటపడటానికి ప్రయత్నిస్తానని చెప్పింది. ప్రస్తుతం తన తల్లితండ్రుల సమక్షంలో ఆ పని చేయబోతున్నట్లు తెలిపింది.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: