తన తల్లి జూమ్ మీటింగ్ లో ఆమె  ఆఫీస్ కో వర్కర్ల తో మాట్లాడుతూ ఉండగా రెండేళ్ల చిన్న పిల్లవాడు  లోడ్ చేసిన గన్ ను తన తల్లి తలపై ఉంచి కాల్చాడు. ఈ ఘటనతో తల్లి తీవ్ర రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన యునైటెడ్ స్టేట్స్‌ ఫ్లోరిడా లో జరిగింది. వృత్తి రీత్యా ఆఫీస్ కు వెళ్లి తిరిగి వచ్చిన షమాయా లిన్ (21) అత్యవసరం కారణంగా జూమ్ ద్వారా సహఉద్యోగులను మీటింగ్ కొరకు ఏర్పాటు చేసింది. ఆఫీస్ విధివిధానాలను ఆమె వివరిస్తూ ఉన్నారు. పిల్లవాడు బ్యాక్ పాక్ లో ఉన్న గన్ ని గుర్తించి. 
IHG
దానిని ఆటవస్తువుగా తలచి వెంటనే దానిని తీశాడు. గన్ లోడ్ చేయబడి ఉంది. అది చిన్నారి యొక్క తండ్రి గమనించక పోయి ఉండవచ్చు. షమాయా లిన్  జూమ్ మీటింగ్ లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గన్ సౌండ్ మీటింగ్ లో ఉన్న అందరికి వినిపించింది ఏమైంది అని అందరు తేరిపారా చూడగా షమాయా లిన్ తీవ్ర రక్త స్రంలో పడిఉంది.వెంటనే మీటింగ్ లోని సభ్యులు వెంటనే 911 కాల్ చేసి సమాచారాన్ని అందించి ఆమెను కాపాడవలసిందిగా కోరారు. ఇంతలో జరగాల్సిన ఘోరం జరిగి పోయింది ఆమె అక్కడి కక్కడే చనిపోయింది. 
IHG

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే గన్ ని అన్ లాక్ చేసి పిల్ల వాడికి అందుబాటులో ఉంచినందుకు పిల్లవాడి తండి వీండ్రే అవెరీ (22) ని పోలీసులు అరెస్ట్ చేసారు. వీండ్రే అవెరీ ప్రధాన నిందితుడిగా ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేసారు. అమెరికాలో గన్ కల్చర్ గురించి చెప్పనవసరం లేదు . అక్కడ యథేచ్ఛగా తుపాకులను వాడుతూ ఉంటారు.  ఇప్పటి వరకు అడ్వొకేసీ గ్రూపు ఎవ్రీటౌన్  సంస్థ జరిపిన లెక్కల  ప్రకారం 2015 నుండి ఇప్పటి వరకు మైనర్లు జరిపిన గన్ ఫైరింగ్ వల్ల 879 మంది చనిపోయారు, 2021  లో జరిపిన లెక్కల ప్రకారం  114 మంది మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: