ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన మోదీ తన సర్కార్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చాలని ఉద్దేశంతో ఎన్నో రకాల సరికొత్త పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.అందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ స్కీం లో సభ్యత్వం తీసుకున్న వాళ్లు ఏకంగా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.. ముఖ్యంగా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ఈ స్కీం యొక్క ముఖ్య లక్ష్యం గా భావిస్తోంది.

పేద ప్రజలు మాత్రమే ఈ స్కీం యొక్క ప్రయోజనాలు పొందడానికి అర్హులు అవుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా దేశంలో ఉన్న ఒక్కో కుటుంబం జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఏకంగా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రయోజనాలను పొందవచ్చు.. ఎవరైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇక ఈ స్కీమ్లో చేరడానికి ఎవరు కూడా ఏ విధంగా కష్టపడకుండానే సులభంగా చేరిపోవచ్చు..


ఇక ఇందుకోసం మీరు ఏం చేయాలి అంటే.. మీకు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి హాస్పిటల్ లో ఉన్న సీఎంఓ ను కలిసి పూర్తి విషయాలను తెలుసుకొని ఉచితంగా ఈ పథకంలో చేరవచ్చు. లేదా ఆరోగ్యమిత్ర ను కూడా సంప్రదించి ఆయుష్మాన్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో నివసిస్తున్న పేద ప్రజలకు ఈ ఆయుష్మాన్ కార్డ్ అనేది నిజంగా వారికి ఆయుష్మాన్ భవతి గా మారిపోయింది. ఇక ఎవరు కూడా ఏ సందేహం లేకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో చేరి కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలను కూడా పొందడానికి సాధ్యమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పథకంలో వెంటనే చేరిపోయి మోదీ సర్కార్ అందిస్తున్న ప్రయోజనాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: