మనకు మన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి పిత్రార్జితం, స్వార్జితం . మన పూర్వీకుల తాతల ముత్తాతల నుండి వచ్చే ఆస్తిని పిత్రార్జితం అంటారు. తండ్రి నుంచి వచ్చే ఆస్తిని స్వార్జితం అంటారు. అయితే తన కొడుక్కి తన తండ్రి ఎంత ఆస్తిని బహుమతిగా ఇవ్వవచ్చో ఇప్పుడు చూద్దాం.


సాధారణంగా పిత్రార్జిత ఆస్తి పై.. కొడుకుకు, కూతురుకు ఇలా ఇద్దరికీ సమానమైన హక్కు ఉంటుంది కానీ స్వార్జిత ఆస్తి తోనే పెద్ద సమస్య.. ఎందుకంటే తండ్రి తను సంపాదించిన ఆస్తి ని కేవలం తనకు నచ్చిన వారికి స్వార్జిత ఆస్తి ని ఇచ్చే హక్కు ఉంటుంది.. అంతేకాదు తను సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఉచితంగా కూడా దానం చేసే సర్వ హక్కులు కూడా తండ్రికి ఉంటాయి.. తండ్రి తను సంపాదించిన ఆస్తినంతా కొడుక్కి బహుమతి రూపంలో ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం దానికి పరిమితులు ఉన్నాయా లేదా అనే అంశంపై చాలామంది తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు..

లివ్ మెంట్ కథనం ప్రకారం.. పన్ను చట్టాల ప్రకారం తండ్రి  కొడుకుకు మాత్రమే కాదు ఏ వ్యక్తికైనా సరే బహుమతి రూపంలో తన స్వార్జిత ఆస్తిని ఇతరులకు ఇచ్చేందుకు ఎటువంటి పరిమితి కూడా ఉండదు.. తండ్రి తన కొడుకు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా బహుమతి రూపంలో ఇవ్వవచ్చు.. కానీ కొన్ని కొన్ని పరిస్థితులలో బహుమతిగా అందుకున్న ఆస్తి నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించి మాత్రం క్లబ్బింగ్ చేయడంలో నిబంధనలు వర్తిస్తాయి.. ముఖ్యంగా కోడలికి లేదా కొడుకుకు ఆస్తిని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఈ డబ్బును లేదా ఆస్తిని బదిలీ చేయడం వల్ల ఆస్తి కారకంగా వచ్చే లాభాన్ని బహుమతిగా ఇచ్చిన వ్యక్తి తో కూడా క్లబ్ చేయాల్సి ఉంటుంది..


ఉదాహరణకు మనదేశంలో రెండు చట్టాల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి బహుమతిగా అందుకున్న ఆస్తి విలువ కేవలం 50 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే ఎటువంటి పన్ను ఉండదు.. కానీ అంతకు మించి తీసుకుంటే మాత్రం తప్పకుండా దానికి పన్ను కట్టాల్సి ఉంటుంది.. తండ్రి తన కొడుకు ఆస్తిని కొడుకు పేరు మీద బదిలీ చేస్తున్నప్పుడు తప్పకుండా స్పెసిఫైడ్ రిలేటివ్స్ అనే కేటగిరీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. కాబట్టి తండ్రి ఎటువంటి సమస్య లేకుండా స్వార్జిత ఆస్తి మొత్తం తన కొడుకుకు ఎంత విలువైన ఆస్తినైనా సరే బహుమతిగా ఇవ్వవచ్చు.. కానీ గిఫ్ట్ రూపంలో అయితే రెండు లక్షలకు మించి తీసుకోరాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: