హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే  దేశమంతటా ఫేమస్ . ఈ బిర్యానీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడూ భోజన ప్రియులతో కిక్కిరిసి ఉంటాయి  దమ్ బిర్యానీ హోటళ్లు. హైదరాబాద్ దాటి ఏ  ప్రాంతానికి వెళ్లినా అక్కడకూడా బిర్యానీ నే . అందరికి ఈ బిర్యానీని తిని తిని బోర్ కొట్టేసినట్టుంది . వారు హైదరాబాద్ కి వచ్చిన రెండు కొత్తరకం బిర్యానీ లకు అలవాటు పడుతున్నారు. భోజన ప్రియులు ఆ ఇతర బిర్యానీల టేస్ట్ చూసి వదలలేక పోతున్నారట. అవేంటంటే ఒకటి దొన్నె బిర్యానీ ఇంకొకటి సత్తిబాబు బిర్యానీ లు . ఈ బిర్యానీల ప్రత్యేకతేంటో చూద్దాం
 
దొన్నె బిర్యానీ :  


IHG
హైదరాబాద్ లో దమ్ బిర్యానీ లాగానే దొన్నె  బిర్యానీ కూడా ఫేమస్ అయ్యింది. చూడడానికి అచ్చమ్ దమ్ బిర్యానీలెక్కే ఉన్న టేస్ట్ మాత్రం ప్రత్యేకం. ఈ బిర్యానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.  ఈ బిర్యానీని రుచి చుసిన వారందరికీ దానిగురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ దొన్నె  బిర్యానీ బెంగళూరు ఫేమస్ వంటకం. ఈ బిర్యానీని అక్కడి ప్రజలు చాల ఇష్టంగా తింటారు. హైదరాబాలో పలు రెస్టారెంట్ లలో ఈ దొన్నె బిర్యానీ  లభిస్తుంది.  దొన్నె అనే ఆకులతో చేసిన ప్రత్యేకమైన బౌల్స్ లో కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులతో తయారుచేసిన అన్నం  పై ఫ్రై చేసిన చికెన్ ముక్కలను , ఉల్లిగడ్డలను , నిమ్మకాయముక్కలు మరియు ఒక కోడిగుడ్డు పెట్టి సర్వ్ చేస్తారు. ఈ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కి పూర్తిగా భిన్నమైన టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన రుచిని కల్గి ఉంటుంది. హైదరాబాద్ అత్తాపూర్ , కొండాపూర్ , మాదాపూర్ , హిమాయత్ నగర్ , ఎస్ ఆర్ నగర్ , తిరుమలగిరి , మియాపూర్ , కేపీహెచ్బీ  వంటి ఏరియాలలో దొన్నె బిర్యానీ ఔట్లెట్స్ ఉన్నాయ్

సత్తిబాబు బిర్యానీ :


IHG

హైదరాబాద్ లో దొన్నె తోబాటు అక్కడ సత్తిబాబు బిర్యానీ కూడా చాల ఫేమస్ అయ్యింది. ఈ బిర్యానీ కూడా డిఫరెంట్ టేస్ట్ ని కలిగి రుచికరంగా ఉంటుంది. కానీ ఈ బిర్యానీ పార్సిల్ గానే లభిస్తుంది. మూసాపేట లోని భవాని నగర్ సమీపం లో ని పిల్లర్ నెంబర్ 895 దగ్గరలో ఈ బిర్యానీ పాయింట్ ఉంది. ఈ బిర్యానీ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే కేవలం 30 నిమిషాలలో పార్సిల్ మీ ఇంటిముందుకు వస్తుంది. ఈ బిర్యానీ ప్రత్యేకతయేంటంటే చూడడానికి సింపుల్ గా అనిపించినా ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిపెట్టలేరు. సత్తిబాబు బిర్యానీ పాయింట్లో చికెన్ ఫ్రై పీసెస్ , స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రత్యేకంగా లభిస్తాయి







మరింత సమాచారం తెలుసుకోండి: