నేటి సమాజం లో కన్న కొడుకులు , కూతుళ్లు ఉన్నా అనాధలుగా వారు జీవనం సాగించలేక వృద్దాశ్రమాలలో ఉంటున్నారు , కొందరు వయసు మీద పడిన తల్లితండ్రులు ఆత్మాభిమానం కోసం రోడ్ పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నారు. వారు చేస్తున్న జీవిత పోరాటం దయనీయం. వారు కష్టం చేసుకోలేక అడుక్కోలేక ఆత్మాభిమానం చంపుకోలేక జీవనం కోసం చేతనైన పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటారు. తాజాగా పూణే కు చెందిన ఓ వృద్ధురాలు రోడ్ పక్కన పెన్నులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శం గా నిలుస్తోంది 
.
IHG
 పెన్నులు అమ్ముకుంటే విచిత్రం ఏముందని అనుకుంటున్నారా. ఇక్కడే ఆమె అందరి మనసుని గెలిచింది , ఆ వృద్ధ పెన్నుల విక్రేత పేరు రత్ని , రత్ని పెన్నులు అమ్ముకుంటూ తన జీవనం గడుపుకుంటుంది . ఆమె ఓ అట్టా పెట్టెలో పెన్నులు పెట్టి ఆ అట్టా పెట్టె మూత పై ఇలా రాసి ఉంచింది " నేను అడుక్కోవాలనుకోవడం లేదు , దయచేసి నాదగ్గర ఉన్న బ్లు , రెడ్ పెన్ లను 10 రూ. కి కొనండి , మీకు కృతజ్ఞతలు, మీకు నా ఆశీర్వాదం " అని రాసి ఉంచింది. ఆమె చిరునవ్వుతో పలకరిస్తూ ఆ బోర్డు చూపించి పెన్నులను అమ్ముతూ వుంది. ఆమెను గమనించిన ఓ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ ఆమె ఫోటో తీసి ఆమె గురించి పోస్ట్ పెట్టాడు అంతే గంట లో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది.




 ఈ పోస్ట్ చుసిన కొందరు జీవనాదారం కోసం ఆ వృద్ధురాలు చేస్తున్న పనిని అభినందిస్తున్నారు. కొంత మంది ఆమె చిరునవ్వుకు ముచ్చట పడిపోతున్నారు . దేశం లో  ఈలాంటి ఆత్మాభిమానం కలిగిన రియల్ హీరోలు సమాజం లో చాలామంది  ఉన్నారు. ఈలాంటి వారు కనపడ్డప్పుడు వారికీ సహాయం గా వారు చేస్తున్న పనిని ఆదరించాల్సిన భాద్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటె వారు కష్టం చేసి బ్రతక లేరు అలాగని అడుక్కోలేరు. ఇలా చేయడం వల్ల వారికీ ఎంతో కొంత సహాయం చేసిన వారమౌతాము.







మరింత సమాచారం తెలుసుకోండి: