ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో చాలా చోట్లలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఒక చోట కొండచరియలు విరిగి పడటంతో అందులో ఒక కారు చిక్కుకుంది.అట్టి కారును బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO)వారు సురక్షితంగా బయటకు తీశారు. దీంతో ఆ కారులో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వాహనం రెండు బండరాళ్ల మధ్య చాలా ప్రమాదకరంగా చిక్కుకుపోయింది. దీనికి తోడు రాళ్ల మధ్యలో నుంచి వేగంగా నీరు ప్రవాహం రావటంతో వారిని కాపాడటం అనేది చాలా కష్టమైంది. ఈ యొక్క ఘటన సోమవారం బద్రీనాథ్ లోని జాతీయ రహదారి సమీపంలోని స్వోలెన్ లంబగడ్ నల్లా దగ్గర చోటుచేసుకుంది. గత కొద్ధి రోజులుగా ఈ యొక్క ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తు ఉన్నాయి.  ఈ కారును రెస్క్యూ ఆపరేషన్‎ను టీం బయటకు తీయడాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో వేశారు.ఇది కాస్త వైరల్‎గా మారింది.

ఉత్తరాఖండ్‎ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపైన ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ ధామి మరియు మంత్రి అజయ్ భట్‌తో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ వానలతో నేపాల్‌కు చెందినటువంటి ముగ్గురు కూలీలతో సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. దింతో వాతావరణం చక్క బడేవరకు వరకు హిమాలయాలలోని దేవాలయాలకు ఎవరు వెళ్లవద్దని అధికారులు వెల్లడించారు. అలాగే చంపావత్ జిల్లా కేంద్రం లోని సెల్ఖోలాలో అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒకరి ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారని రాష్ట్రనికి చెందిన అత్యవసరమైన ఆపరేషన్ సెంటర్ తెలియ జేసింది.

అలాగే రిషికేశ్‌లోని చంద్రభాగ అనే వంతెనతపోవన్, ముని-కి-రేతి మరియు లక్ష్మణ్ జూలా, భద్రకాళి  దాటడానికి ప్రయాణికులను,వాహన దారులను అధికారులు అనుమతించలేదు. యాత్రికులు ఎవరేనా వాతావరణం చక్కబడేవరకు వరకు రెండు రోజులు  తమ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలియ జేశారు. అలాగే రాష్ట్రము మొత్తం వరకు అన్ని పాఠశాలలు సోమవారం రోజు మూసివేశారు. అలాగే నంద దేవి బయోస్పియర్ రిజర్వ్ తో పాటుగా ఇంకా కొన్ని అటవీ విభాగాలతో కలిపి రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలల్లో ట్రెక్కింగ్ మరియు పర్వతారోహణ వంటి కార్యకలాపాలపై నిషేదాన్ని విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: