క్లాత్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తు వచ్చేది ఏమిటంటే మనం ధరించే దుస్తులు.. అందులో రకరకాల ఫాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ ని బట్టి ధరలు కూడా వ్యాపారస్తులు నిర్వహిస్తూ ఉంటారు.. ఇప్పుడు చెప్పబోయే క్లాత్ ఏంటో తెలిస్తే ముందుగా ఆశ్చర్యపోతారు.. ఇక దీని ధర ఎంతో తెలిస్తే మీ కళ్ళు చెదిరిపోయాయి.. ఆ తర్వాత దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆ క్లాత్ ఏదో కాదు ఆపిల్ ఫోన్ ల స్క్రీన్ లను తుడిచే క్లాత్.. నిజానికి యాపిల్ సంస్థ మార్కెట్లోకి ఏం విడుదల చేసినా.. ఒక సంచలనం సృష్టిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే..


ఆపిల్ సంస్థ విడుదల చేసే స్మార్ట్ ఫోన్ లు అయినా సరే లేదా ల్యాప్ టాప్ లు అయినా సరే సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడమే కాకుండా ధరలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. ప్రస్తుతం ఆపిల్ సంస్థ ఆపిల్ స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను తుడవడానికి ఒక క్లాత్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.. దీని ధర భారత మార్కెట్లో అక్షరాలా..1900 రూపాయలు.. ఏంటి అంత చిన్న క్లాత్ ధర ఏకంగా పంతొమ్మిది వందల రూపాయల అని ఆశ్చర్యపోయినా ఇండియాలో మాత్రం ఈ క్లాత్ లకు మంచి డిమాండ్ ఉంది.


చాలామంది ఈ క్లాత్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఆపిల్‌ లోగోతో మార్కెట్‌లోకి విడుదల అయిన ఈ క్లాత్‌ ధర 19 డాలర్లు (రూ. 1424). కానీ భారత్‌లో ఆపిల్ సంస్థ దీని ధరను రూ. 1900గా నిర్ణయించింది. ఈ ఆపిల్ క్లాత్‌తో ఐఫోన్‌ 6 నుంచి ఆ తర్వాత వచ్చిన అన్ని ఫోన్ల స్క్రీన్లను మనం శుభ్రం చేసుకోవచ్చని ఆపిల్ సంస్థ తెలిపింది. కానీ  మార్కెట్లో ఈ క్లాత్‌కు అధిక డిమాండ్‌ ఉన్నా.. అందుకు తగినట్లు సరఫరా లేకపోవడం వల్ల వీటి కొరత ఏర్పడింది.అందుకే  సోమవారం మార్కెట్ లోకి రెండు కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్‌ను విడుదల చేస్తూ.. వాటితోపాటు ఆపిల్‌ సంస్థ ఈ క్లాత్‌ను కూడా విడుదల చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: