ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు  రోజు రోజుకి సామాన్యుడికి భారంగానే మారిపోతున్నాయ్. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు  తప్ప పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్యుడికి ఊరటనిచ్చే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలు ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సెంచరీ దాటిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు.



 కాగా పెట్రోల్ ధరలు తగ్గికపోతాయా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రతి ఒక సామాన్యుడు. ఇలాంటి సమయంలో రోజూరోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. అటు పెట్రోల్ ధరల పెరుగుదల రూపాయలలో ఉంటే మాత్రం పైసల్లో మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో పెట్రోల్ ధర తగ్గింది అని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అసలు ధరలో మాత్రం ఎలాంటి తేడా రావడం లేదు. అయితే ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తి పోతుంటే అటు అదే సమయంలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు మాత్రం మోసాలకు పాల్పడుతూ ఉండడం  సామాన్యులకు మరింత శాపంగా మారిపోతుంది.



 పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఎలా మోసాలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా ఇటీవల ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం లోని ఇండియన్ ఆయిల్ బంక్ లో యువకుడు ఒక బాటిల్లో వంద రూపాయల పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే ఇలా లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే కనీసం అరలీటరు వరకు కూడా పెట్రోల్ రాకపోవడం గమనార్హం. దీంతో చిర్రెత్తిన ఆ యువకుడు ఇదేంటి అంటూ నిలదీశాడు. బాటిల్ లో కాకుండా ఒకవేళ వాహనంలో కొట్టించుకుని ఉంటే ఈ విషయం ఎలా తెలిసేది అంటూ నిలదీశాడు. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగింది బంకు యాజమాన్యాలు బదులు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: