సాధారణంగా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిపోయిందో.. అంతే స్థాయిలో భక్తిపారవశ్యం కూడా భక్తులలో పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ నేపద్యంలోనే చాలామంది భక్తులు గాయత్రి మంత్రం.. మృత్యుంజయ మంత్రం ఎన్నో మంత్రాలను ఫోన్ రింగ్టోన్ లుగా పెట్టుకుంటున్నారు.. అయితే ఇలాంటి మంత్రాలు ఫోన్ లలో రింగ్ టోన్ లు గా పెట్టుకోవడం వల్ల ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు కొంతమంది పండితులు.. అది ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

మంత్రాలు అనేవి కేవలం పూజామందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఉచ్చరించాలని ఎప్పుడు పడితే అప్పుడు..ఎక్కడ పడితే అక్కడ.. ఈ మంత్రాలను ఉచ్చరించరాదని,  ఫలితంగా దేవుడు కోపోద్రిక్తుడై  మన పతనం చూస్తాడు అని కొంతమంది ఆధ్యాత్మిక పురోహితులు చెబుతున్నారు.. కానీ ఇవన్నీ విన్న ప్రజలు మాత్రం కొంతమంది నిజమేనని మరింత భయపడి పోతుంటే , మరి కొంత మంది ప్రజలను మరింత భయపెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సెల్ ఫోన్లలో వచ్చే రింగ్ టోన్ గా  ఎలాంటి పాటలు పెట్టుకున్నా..లేక మంత్రాలు పెట్టుకున్నా.. అందరూ వింటారు కాబట్టి వినడం వల్ల ప్రతి ఒక్కరికి జ్ఞానం పెరుగుతుంది అలాంటప్పుడు ఎందుకు ఈ మంత్రాలను సెల్ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకో కూడదు అని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ రింగ్టోన్ ఎంత అద్భుతంగా ఉంటే చుట్టుపక్కల వేరే వాళ్లకు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే..అందు కోసమే చాలామంది ఏరికోరి మరీ డబ్బులు వెచ్చించి కూడా అద్భుతమైన పాటలను తమ రింగ్ టోన్ లుగా పెట్టుకుంటూ ఉంటారు. అందరికీ చెప్పే విషయం ఏమిటంటే మనిషి జీవితం చాలా సంతోషంగా.. స్వతంత్రంగా ఉండాలి తప్ప ఇలాంటి చిన్నచిన్న వాటిలో కూడా ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని బ్రతకడంలో ఏ మాత్రం సంతోషం ఉంటుంది.. అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..

ఇలాంటి వార్తలు, రూమర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవితం చాలా చిన్నది అని .సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: