IHGస్టే

డియం లో జరిగే ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్ వంటి ఆటలు జరిగే టప్పుడు ప్రేక్షకులనుండి వినూత్న ప్రదర్శన వినిపిస్తుంది మరియు కనిపిస్తూ ఉంటుంది. గతం లో జరిగిన ఎన్నో సంఘటనలు ఇందుకు ఆధారం. తాజాగా ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ చిన్నారి  అభిమాని చేసిన పని స్టేడియం మొత్తాన్ని ఒక్కసారిగా నిశ్శబ్దానికి గురిచేసింది. ఆర్బీ లీప్జిగ్ మరియు పీఎస్ జీ టీమ్ ల మధ్య మంగళవారం ఫుట్ బాల్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరుటీమ్ లు అట విరామ సమయానికి చేరి ఒక గోల్ సాధించాయి అయితే విరామం తరువాత తొమ్మిదవ నిమిషంలో కేలియాన్ ఎంబప్పీ స్విఫ్ట్  కౌంటర్  ఎటాక్ ని గోల్ గా మలిచాడు. దింతో 2 :1  ఆధిక్యం లోకి పీఎస్ జీ వచ్చింది. అయితే  29 వ నిమిషంలో ఆండ్రే సిల్వా  ఆర్బీ లీప్జిగ్ టీమ్ తరపున గట్టి గోల్ సాధించాడు. దింతో ఇరు టీమ్ లు సమాన స్కోర్ ని సాధించాయి.
IHG అ

యితే   పీఎస్ జీ టీమ్ అనూహ్యంగా మరో చివరి గోల్ చేసి విజయాన్ని చేజిక్కిచ్చుకుంది. అయితే ఈ మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ కోసం వచ్చిన ఓ చిన్నారి అభిమాని తన దగ్గర ఉన్న ప్లకార్డు చూపించి అందరి అట్టెన్షన్ ని గ్రాబ్ చేశాడు.  పీఎస్ జీ టీమ్ ప్లేయర్ అయినటువంటి లియోనెల్  మెస్సి యొక్క జెర్సీని అడగడం తో లియోనెల్  మెస్సి కూడా ఒకంత ఆశ్చర్యానికి గురిఅయ్యాడు. ఆ జూనియర్ లియోనెల్  మెస్సి అభిమాని తన ప్లకార్డు పై ఇలా రాసి ఉంచాడు "లియో నాకు నీ చొక్కా ఇవ్వండి నేను నీకు మా అమ్మని ఇస్తాను " . ప్రస్తుతం ఈ ప్లకార్డు ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా ఆ బాబు మెసేజ్ గురించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

IHG


 గతం లో కూడా ఇలాంటి ప్లకార్డు ల ప్రదర్శన సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఫుట్ బాల్ ప్లేయర్  క్రిస్టియానో  రోనాల్డో  యొక్క యువ అభిమాని తాను ఇలా ప్లకార్డు ని ప్రదర్శించింది " రోనాల్డో కెన్  ఐ  మ్యారి , జూనియర్  ?" (నేను JR ని పెళ్లి చేసుకోవచ్చా?) అంటూ ప్లకార్డు పై ప్రదర్శించింది. ఇలాంటి మెసేజ్ లు చూసినప్పుడు ప్లేయర్స్ లో ఏదో తెలియని ఉత్సహం నింపబడతాయి. అయితే   లియోనెల్ మెస్సి జూనియర్ అభిమాని చేసిన పనికి సోషల్ మీడియాలో ఫన్నీ  కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: