నిద్ర సుఖమెరుగదు అని పెద్దలు ఊరికే అన్నారా..? ఒక్కసారి నిద్ర వచ్చింది అంటే ఇక ఆపడం ఎవరి తరం కాదు.. అందుకే చాలా మంది ప్రయాణం చేసేటప్పుడు అయినా లేదా వర్క్ ఫ్రం హోం పేరిట పనులు చేసే వారైనా సరే కూర్చున్న చోటే నిద్రపోతూ ఉంటారు. అయితే ఇలా కూర్చున్న చోటే నిద్రపోవడం వల్ల కొంత వరకు లాభం కలిగితే , మరి కొంత నష్టం కూడా కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే కూర్చుని నిద్రపోవడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..


కూర్చొని నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు..
1. కూర్చొని నిద్రపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచి జరుగుతుందట..ఎందుకంటే వీరి కడుపులో పిండం పెరిగే కొద్దీ మీరు పడుకునే భంగిమ లో ఇబ్బంది కలగవచ్చు.. కాబట్టి చాలా వరకు కూర్చోని నిద్ర పోవడం వల్ల నిద్ర బాగా పట్టడంతో పాటు బేబీ పెరుగుదల కూడా బాగా ఉంటుందని చెబుతున్నారు.

2.కూర్చుని నిద్రపోవడం వల్ల 'అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' లక్షణాలు కూడా  తగ్గించవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనం కలుగుతుంది.ఇక ఇందుకు గల కారణం ఏమిటంటే.. తల ఎత్తైన స్థానంలో ఉండడమే..

3. యాసిడ్ రిఫ్లక్స్ నుంచి కూడా  ఉపశమనం లభిస్తుంది. కూర్చోవడం వల్ల అన్నవాహిక పనితీరు మెరుగుపడి, జీర్ణశయాంతర అసౌకర్యం, జీర్ణ సమస్యలు  తగ్గుముఖం పడతాయి.


కూర్చొని నిద్ర పోవడం వల్ల కలిగే నష్టాలు..
1. కూర్చొని నిద్రపోవడం వల్ల తొడలు , కాళ్లు వంటి భాగాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే నడవడం వల్ల రక్తసరఫరా బాగా జరుగుతుంది.. కానీ ఒకే చోట కూర్చొని స్థిరంగా ఉండటం వల్ల రక్త సరఫరా కూడా నెమ్మదిగా జరిగి ఒక్కోసారి గడ్డకట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

2. ఎక్కువ సేపు ఒకే చోట స్థిరంగా కూర్చోని,  నిద్రపోవడం వల్ల నడుం నొప్పి , వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

3. అంతేకాదు కాళ్లు పట్టేసినట్టు అనిపించడం, ఒళ్ళు నొప్పులు వంటి  సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నిద్ర వచ్చినప్పుడు స్ట్రైట్ గా పడుకోవడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: