సినిమా ప్రేక్షకులు ఎవరైనా సరే సినిమాను కేవలం థియేటర్లలో ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఒకవేళ ఒక సినిమాను వారు థియేటర్లలో చూడకపోతే ఆ సినిమా పెద్దగా ఆస్వాదించలేము అని చెబుతూ ఉంటారు సినిమా ప్రేక్షకులు.. సినిమా థియేటర్ లో కి వెళ్ళేటప్పుడు కూడా దానికి ఏసి ఉందో లేదో తెలుసుకొని మరి టికెట్ బుక్ చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా వేసవి కాలం అయితే తప్పకుండా థియేటర్ లో ఏసీ ఉండాల్సిందే... ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే సినిమా అనుభూతిని పొందడం కోసం ఏసీ థియేటర్ బుక్ చేసుకొని మరీ వెళ్లి సినిమాలు ఆస్వాదిస్తారు సినీ ప్రేక్షకులు.కాని ఇదే థియేటర్ ఒక మండిపోయే ఎడారిలో ఉంటే.. వెళ్ళగలమా.. అసలు నీటి జాడే కనిపించని ఒక ఎడారిలో థియేటర్ ఏంటి అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి ఎడారిలో భారీ స్క్రీన్ లతో ఒక థియేటర్ ను ఏర్పాటు చేశారు.. ఎక్కడంటే పిరమిడ్ లకు ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ దేశంలో ఉన్న ఎడారిలో ఒక థియేటర్ ను రూపొందించడం జరిగింది.. చూడడానికి భారీ స్క్రీన్ ఉంటుంది కానీ ఈ థియేటర్లో ఇప్పటివరకు ఒక్క ప్రదర్శన కూడా జరగలేదు. ఇందుకు గల కారణమేమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఈజిప్ట్ అనగానే పురాతన నాగరికత, ప్రఖ్యాతి చెందిన పిరమిడ్లు , ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నైలు నది, ప్రపంచంలోనే అత్యంత సౌందర్యరాశి గా గుర్తింపు పొందిన క్లియోపాత్రా సొగసులు మనకు గుర్తుకొస్తాయి.. ఈజిప్ట్ అంటే వింతలు విశేషాలు లకు ప్రసిద్ధి చెందిన దేశం. ఇకపోతే ఈజిప్ట్ లోని సినాయ్ ద్వీపకల్పానికి దక్షిణ దిక్కుగా ఒక ఎడారి మధ్యలో ఉన్న పర్వత శ్రేణి కింద వందల సంవత్సరాల క్రితం ఒక థియేటర్ నిర్మించారు.. కానీ ఈ థియేటర్లో ఇప్పటివరకు ఒక ప్రదర్శన కూడా జరగకపోగా, ఈ అద్భుతమైన థియేటర్ లో వందలాది కుర్చీలు వున్నాయి . ఇక  ప్రస్తుతం  పర్యాటక కేంద్రంగా మారిపోయింది..

ఇక ఈ థియేటర్ ను ఒక ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి నిర్మించాడు. ఇకపోతే గంజాయి వ్యసనానికి బాగా అలవాటు పడిన ఈయన తన దగ్గరున్న డబ్బు మొత్తం వృధా అయిపోతుంది అనే  ఆలోచనతో ఒక థియేటర్ ను నిర్మించాలని అనుకున్నాడు.. ఇక అనుకున్నదే తడువుగా స్నేహితుల సలహాలు తీసుకోని, సినిమా థియేటర్ ను ఎడారిలో పర్వతాల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ థియేటర్ ను నిర్మించాడు.. ఈజిప్టు రాజధాని కైరో నుంచి కూడా చైర్స్ తెప్పించడం జరిగింది.. అలాగే జనరేటర్ ని కూడా తెప్పించారు. కానీ ఎడారిలో సినిమా చూడడం ఏంటి అని అనుకున్న ప్రేక్షకులంతా అక్కడున్న జనరేటర్ కూడా ఎత్తుకు పోయారు.. థియేటర్ ప్రస్తుతం శిధిలమై పోయింది. ఇక ఇప్పుడు మాత్రం ఒక పర్యాటక కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: