సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్క వార్త ప్రజలకు త్వరగా చేరుతుంది అని సంతోషించాలో లేక తప్పుడు ప్రచారాలు వల్ల ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడతారో తెలియక సిగ్గుపడాలో తెలియని పరిస్థితులలో మనం ఉన్నామని చెప్పవచ్చు.. కొంతమంది సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజలను తమ వలలో వేసుకొని, డబ్బులను కాజేయాలన్న కారణంతోనే ఇలాంటి ఆశలు చూపిస్తున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు జాగ్రత్తపడాలి అని కూడా హెచ్చరిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం గా అందిస్తోంది.. అని ఒక ప్రకటన వచ్చింది.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియక ప్రజలంతా సతమతమవుతున్నారు.. అంతేకాదు సైబర్ నేరగాళ్లు ఏమైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిజంగానే నాలుగు వేల రూపాయల సహాయం అందిస్తోందా..లేక ఇది ఒక రూమరా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకం తీసుకొచ్చిందని.. అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు నాలుగు వేల రూపాయలు ఉచితంగా అందిస్తుంది.. అనే వార్త వెలువడడంతో ప్రతి ఒక్కరు సంబరపడిపోయి ఈ పథకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటూ కొంతమంది ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్ చేసి వారి అధికారులను విసుగిస్తున్నారట. ఒకేసారి ఇంతమంది ఫోన్ చేస్తుండడంతో డౌట్ వచ్చిన ప్రభుత్వం అధికారులు ఆరా తీయగా విస్తుపోయే నిజాలను కనుక్కున్నారు. అంతేకాదు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై అధికారికంగా స్పందించింది.

ప్రధాన మంత్రి రంబన్‌ సురక్ష యోజన పథకం పేరుతో జరుగుతోన్న ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని అధికారికంగా కూడా  ప్రకటించింది.అంతేకాదు  ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్పింది. ఇలాంటి వార్తలు ప్రజల దృష్టికి వస్తే ఎవరైనా సరే  ఒకటికి పదిసార్లు నిర్ధారించుకోవాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: