మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలి కూడా ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి.. అప్పట్లో ఎక్కువగా శరీరానికి శ్రమ పెట్టేవారు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. వీటన్నిటికి భిన్నంగా మన ప్రవర్తన ఉంటోంది. ఇప్పుడు వచ్చిన మార్పుల కారణంగా.. మనిషి తినే ఆహారంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో నేల మీద కూర్చొని ఆహారాన్ని భుజించేవారు. కానీ ప్రస్తుతం అందరూ ఎక్కువగా డైనింగ్ టేబుల్స్ పైనే కూర్చొని తింటున్నారు. ఇప్పుడు అత్యధిక సంఖ్యలో చాలామంది ఇలానే చేస్తున్నారు. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నవి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


1). నేల పై కూర్చుని ఆహారం తినడం వల్ల, మనం తినే  ప్లేట్ కింద ఉంటుంది కాబట్టి, మనం తినేటప్పుడు ప్రతిసారి ముందుకి , వెనక్కి కదులుతూ ఉంటాము. ఇలా భోజనం చేయడం వల్ల, పొట్ట లోపల ఉండేటువంటి కండరాలు బాగా కదులుతాయి. అప్పుడు మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

2). ముఖ్యంగా కింద కూర్చొని భోజనం చేయడం వల్ల వెన్నపూస స్ట్రైట్ గా ఉంటుంది. దీంతో మెదడుకు సమాచారం సులువుగా చేరుతుంది.

3). ఇటీవల కాలంలో చాలా మంది నేలపై కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడడం లేదు.. కానీ ఎప్పుడైతే నేలపై మనం పద్మాసనం లో కూర్చుని భోజనం చేస్తామో.. అప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.. కాకుండా కుర్చీలపై, సోఫాలో కూర్చుని భోజనం చేయడం వల్ల గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగక, గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి..

అంతేకాదు నేలపై కూర్చుని తినడం వల్ల కీళ్లు కూడా బాగా వంగడమే కాకుండా మనం కూడా చాలా ఆరోగ్యంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ఉండవచ్చు. చూశారు కదా..! నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎంతటి ప్రయోజనాలు చేకూరుతాయో కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్కరు నేలపై కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: