అతడు ఒక పాకిస్తానీ , దేశ, సందర్శకుల వీసా పై దుబాయ్ లాంటి ముస్లీమ్ దేశాలలో కచేరీలు చేస్తూవుంటాడు.  అతడి పూర్తి పేరు మహమ్మద్ అబ్బాస్ ఇక్రమ్,   హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో ఉంటున్న ఓ యువతీ కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. పదమూడు సంవత్సరాల క్రితం ఆమెకు పెళ్లి కాగా ఒక కుమార్తె పుట్టిన తరువాత భర్త చనిపోయాడు ఈ క్రమంలోనే ఆమె దుబాయిలో ఉంటూ జీవనం సాగిస్తూవుంటూ ఉంది. తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్రమ్ ఆయువతికి ..తనుకూడా భారత్ లోని ఢిల్లీ ప్రాంతానికి చెందిన ముస్లీమ్ గా పరిచయం చేసుకుని ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమం లోనే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. వివాహం ఐన మొదటినెలకే  హైదరాబాద్ లో చాదర్ఘాట్ కి వచేసాడు.



 వీరిద్దరికి ఓ ఆడపిల్ల జన్మించింది. కొంత కాలం గడచిన తరువాత ఇక్రమ్ తాను పాకిస్థానీయుడినని భార్యకు చెప్పాడు అయితే ఈ విషయం ఎక్కడన్నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుండి మహిళా అతడి విషయంలో కాస్త భయంభయంగా ఉండ సాగింది. ఈ క్రమం లోనే ఆమె ఆరుసంవత్సరాల పెద్దకూతురిపై అతడి ప్రవర్తన ఆమెను మరింత ఆందోళనకు గురిచేసింది ఈ క్రమంలోనే అతడిపై కేసుపెట్టింది. కేసునమోదు చేసిన పోలీసులు కేసు విచారణలో విస్తుపోయేనిజాలను కనుగొన్నారు. ఇక్రమ్ భారతీయుడు కానప్పటికీ తాను భారతీయుడినే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆధార్ కార్డు ను చాదర్ ఘాట్ లో ఉంటున్న నిజాం ఖాజా ద్వారా పొందాడు.



 తన చదువుకు సంబందించిన నకిలీ విద్యార్హత 10 , ఇంటర్ ధ్రువపత్రాలను వరంగల్ నుండి పొందాడు . ఈ సర్టిఫికెట్స్ ను  తన స్నేహితుడైనటువంటి   రమేష్ ములేఖి కి పంపి ముంబైలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ పేరుతో నకిలీ యూనివర్సిటీ ద్వారా నకిలీ డిగ్రీ పట్టాను ౧౦ వేలు చెల్లించి పొందాడు. ఇవే నకిలీ పత్రాలతో ఏడేళ్ళక్రిందట భారత వీసాను కూడా పొందడం గమనార్హం. అయితే ఈ విషయాలన్నీ గమనిస్తున్న ఇక్రమ్ భార్య ఒకంత బెరుకుగా ఉండేది. అయితే ఈ విషయమై అతడితో వీరిద్దరికి మనస్పర్థలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆమె మొదటి కూతురి ఫోటోల చిత్రీకరణ మరియు వీడియో చిత్రీకరణ ఆమెను ఎంతగానో కృంగదీసింది . గతంలో కూడా ఈవిషయమై అతడిపై కేసు నమోదు చేసింది.



తాజాగా ఇక్రమ్ తన కూతురి ఫోటోలను దుబాయ్ షేకులకు పంపి తన కూతురిని అమ్మేసినట్లు ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పగా ఆ విషయాన్నీ ఆమె స్నేహితురాలు ఆమెకు తెలుపగా వెంటనే ఈ విషమై అతడిపై పొలిసు కేసు పెట్టింది. విచారణ చేసిన పోలీసులు అతడి గురించి పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధితో మాట్లాడి అతడి పౌరసత్వం పై అరా తీశారు. అతడు పాకిస్తాన్ పౌరుడుగా వారు నిర్ధారించారు. అయితే అతడు నకిలీ సర్టిఫికెట్స్ తో అధికారులను మోసం చేసినందుకు గాను అతడికి  రెండు వేలు ఫైన్ తో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేశారు. అదేవిధంగా తాకిడికి సహకరించిన అతని స్నేహితుడు రమేష్ ములేఖికి ఐదు సంవత్సరాలు జైలు శిక్షను ఖరారు చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: