ఇక ఈ విశ్వంలో ప్రతి జంతువు పుట్టుకకు కారణం తల్లి. తల్లి బిడ్డల బంధం విడదీయరానిది.ఏ కల్మషం లేని బంధంలో తల్లి, బిడ్డల స్థానం అనేది ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటుంది. తల్లికి ఎంత ప్రమాదం జరిగిన తాను ఎలా ఉన్నా కాని తన బిడ్డ మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది.ఇక ప్రమాదంలో వున్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి తన బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా సరే వెళుతుంది.. ఎంత పెద్ద ప్రమాదాన్ని అయినా ఎదుర్కొంటుంది. అలాగే ఎవరితోనైనా సరే ప్రాణాలకు తెగించి ఆ తల్లి తన బిడ్డ కోసం పోరాడుతుంది. ఇక తన ఒంట్లో ఉన్న శక్తి చాలీనా చాలకపోయినా తన శక్తినంతా కూడా దారపోసి తన బిడ్డను శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఆ తల్లి ప్రయత్నిస్తుంది. అయితే ఇది కేవలం మనుషులకే మాత్రమే పరిమితం అనుకుంటే ఇక్కడ మనం పొరపడినట్లే.. ఎందుకంటే ఈ విశ్వంలోజంతువులు అన్ని కూడా కూడా తమ పిల్లలపై అమితమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాయి. 

ఇక తమ పిల్లల జోలికి వస్తే ఎంతటి వారితోనైనా సరే అవి పోటీకి దిగుతాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియోనే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఓ కోడి తన చిన్నారి పిల్లలను తీసుకొని షెడ్డు నుంచి బయటకు వచ్చింది. ఇక అదే సమయంలో ఓ కుక్క కోడి పిల్లలపైకి దూసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన ఆ తల్లి కోడి ఆ కుక్క పైకి దాడి చేసింది. తన కంటే పెద్ద జీవి అని తెలిసినా కాని ఆ కుక్కని తరిమి, తరిమి పరిగెత్తించింది.ఇక తన పిల్లలు సేఫ్‌ అనుకునేంత దూరం వరకు ఆ కోడి ఆ కుక్కను తరిమి కొట్టింది.తన బిడ్డలను కాపాడుకుంది.ఇక దీన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.ఇక దీంతో ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌గా మారింది.
 

https://twitter.com/fred035schultz/status/1457820416089722891?t=z7JpwI9Zkkc8I6ozbPzfUA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: