చంద్రునిపై మానవ మనుగడకు సంబంధించి శస్త్ర పరిశోధనలు ప్రపంచ దేశాలు చేస్తూఉన్నాయి. గతంలో చంద్రునిపై వాతావరణ విషయాలను పలు అంతరిక్ష పరిశోధనా సంస్థలు వెల్లడించాయి . రానున్న రోజుల్లో భూమి పై మానవ మనుగడ సాధ్యం కానీ పక్షంలో మానవునికి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించినప్పుడు శాస్త్రవేత్తలకు భూమిని పోలిన గ్రాహం విశ్వం లో ఉందా అనే ప్రశ్న కలిగింది. ఒకవేళ ఉంటె మానవ మనుగడ సాధ్యమేనా అనే ప్రశ్నకూడా తలెత్తింది. ఈ క్రమంగా లోనే కొన్ని సంవత్సరాలుగా విశ్వం లో అటువంటి గ్రాహం కోసం వెతుకులాట ఆరంభించారు. ఈ క్రమం లోనే చంద్రునిపై శస్త్ర పరిశోధనల తరువాత మానవ మనుగడ సాధ్యమని తెలుస్తూఉంది. తాజాగా ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిని గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.  
IHG


మనిషి జీవించడానికి కావలసిన ప్రాణవాయువు (ఆక్సిజన్) చంద్రుని పై అపారంగా ఉందని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ పేర్కొంది. అయితే ఆ ప్రాణవాయువు చంద్రుని వాతావరణం లో కాదని  పేర్కొంది. చంద్రుని భూ పొరల్లో ప్రాణవాయువు ఇబ్బడిముబ్బడిగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఆ ప్రాణవాయువు రాళ్ల లో , శిలాజాలలో ఆక్సిజన్ మిళితమై ఉన్నట్లు తెలిపింది. చంద్రునిపై ఉన్న శిలాజాలను, రాళ్లను సేకరించి వాటి ద్వారా ప్రాణవాయువును ఉత్పత్తి చేసే ప్రయోగాలు ఆస్ట్రేలియా మొదలు పెట్టింది.


IHGఅయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఆస్ట్రేలియా తయారుచేసిన రోవర్ల సహాయంతో చంద్రునిపై ఉన్న రాళ్లను సేకరించి భూమి మీదకు తీసుకురావడం తద్వారా ప్రాణవాయువును తయారు చేసే ప్రయోగాలు మొదలు పెడతారు. చంద్రునిపై వాతావరణం లేదు . చందమామ ఉపరితలం పై దుమ్ము ధూళి తో పటు రాళ్లు, సిలికా , ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్‌ లు , అల్యూమినియం లు ఉన్నాయ్. పైన పేర్కొన్న వాటన్నింటిలో ప్రాణవాయువు సమృద్ధిగా ఉంది . ఈ మేరకు ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ  ఓ అంచనాకు వచ్చింది. చంద్రుని ఉపరితలం కి  దాదాపు 10 మీటర్ల లోపల ఒక క్యూబిక్ మీటర్ స్టోన్స్ లో దాదాపు 630 కిలోల ప్రాణవాయువు ఉందని ఆస్ట్రేలియా చెబుతోంది. అయితే మనిషికి ఒక రోజుకు  800 గ్రాముల ప్రాణవాయువు అవసరం.

IHG
1 క్యూ .ఎమ్ రాళ్ళద్వారా లభించే 630 కిలోల ప్రాణవాయువుతో ఒక మనిషి రెండేళ్లు బ్రతకవచ్చు. ఈ ప్రకారం గా 800 కోట్ల మంది జనాభా దాదాపుగా లక్ష ల సంవత్సరాలు చంద్రుని పై జీవించవచ్చని తెలుస్తోంది. అయితే వాతావరణమే లేని చంద్రుని ఉపరితలం లోపల దాదాపు 10 మీటర్ల లోతు వరకు వున్నా వివిధ శిలాజాలలో ఆక్సిజన్ సమ్మేళన రూపం లో దాగి ఉంది. శాత్రవేత్తలు ఈ ప్రాణవాయువుని సమర్ధవంతంగా బయటకు తీయగలిగితే చంద్రుని పై జీవనం సుసాధ్యమౌతుంది.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: