బాల్యదశ నుండి యవ్వనం లోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి శృంగారం పై అవగాహన కల్పించాలంటూ వక్తలు , నిపుణులు ప్రజా వేదికల్లో ప్రసంగిస్తూ ఉంటారు . ప్రధానంగా పాఠశాల స్థాయి నుండే ఈ విషయాన్నీ సబ్జెక్టు గా బోధిస్తే చాలాబాగుంటుంది అని అభిప్రాయపడుతుంటారు కూడా . కానీ ఈ ప్రసంగాలు వేదికలవరకే పరిమితం అవుతున్నాయి ఆచరణలో కనిపించడం లేదు. ఈ అవగాహన రాహిత్యం వల్లనే నేటి సమాజం లో ఘోరమైన అసాంఘిక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు కారణం చిన్నతనం నుండి శృంగారం పట్ల యువతలో ఉన్న అపోహలే. అంతే కాకుండా యువత చెడు వేసనాలతో తమ జీవితాన్ని అంధకారం లో పాడేసుకుంటున్నారు. చిన్నతనం లోనే ఈ చెడు అలవాట్లవల్ల అవగాహన ఉండి ఉంటే వారికీ దయనీయ దుస్థితి వచ్చేది కాదు.


 IHG
తాజాగా ఇంగ్లాండ్ దేశానికీ చెందిన ఓ యూనివర్సిటీ ఈ విషయాన్నీ ప్రయోగశాలలో ప్రాక్టికల్ సబ్జెక్టు గా ఆచరించనుంది. ఇంగ్లాండ్ లోని  డుర్హాం విశ్వవిద్యాలయం ఈ సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. శృంగారం పై నేటి సమాజం లో ఉన్న అపోహలను తొలిగించేలా వారిలో అవగాహన కలిగేలా వారికీ శృంగారం ఒక ప్రాక్టికల్ సబీజెక్టు గా ప్రవేశపెట్టాలని  డుర్హాం విశ్వవిద్యాలయంకి చెందిన విద్యార్థి యూనియన్ వర్శిటీ యాజమాన్యానికి చేసిన ప్రతిపాదన కు యాజమాన్యం సానుకూలంగా ప్రతి స్పందించి ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.




IHG
 అంతే కాకుండా డ్రగ్స్ కి బానిసలై వారికీ తెలియకుండానే వారు పడుపు వృత్తిలోకి దిగి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులకు మానసిక స్తైర్యాన్ని నింపేవిధంగా వర్శిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై సానుకూలంగా వర్శిటీ యాజమాన్యం ముందుకు వచ్చింది. విద్యార్థులు చేసిన వినతికి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది . మానసికంగా వారికీ అండగా ఉంటామని హామిఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.




IHG

మరింత సమాచారం తెలుసుకోండి: