గత వారం రోజులుగా కురుస్తున్న వానల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తీరా ప్రాంతపు ఊర్లన్నీ వర్షపు నీటితో మునిగి పోయాయి. వాగులు వంకల నీటితో సముద్రాలు అల్లా కల్లోలం గా తయారయ్యాయి. ఇదిలా ఉంటె సముద్ర తీరా ప్రాంత ప్రజలు బంగారం కోసం సముద్ర తీరా ప్రాంతాలలో తెగ గాలిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా లోని ఉప్పాడ బీచ్ తీరప్రాంతం లో బంగారం విరివిగా దొరుకుతుందని తెలియడంతో ప్రజలు బంగారం కోసం తెగ గాలిస్తున్నారు. అయితే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా బంగారం కోసం తీరా ప్రాంతం లో తెగ జల్లెడపట్టి గాలిస్తున్నారు.



అయితే గతం లో కూడా ఉప్పాడ బీచ్ లో బంగారం దొరుకుతుందనే వదంతు తెలియడంతో అక్కడకు భారీగా జనం బంగారం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ప్రస్తుతం కూడా అలంటి వదంతు ప్రచారం జరగడంతో వెంటనే సమీప తీరా ప్రాంత ప్రజలు బంగారం వేట కొనసాగిస్తున్నారు. అయితే సానిక మహిళలు మాత్రం బంగారం వేటలో వారికీ బంగారు ఉంగరాలు , రేణువులు , రూపులు , చెవిదుద్దులు లాంటి బంగారు వస్తువులతో పాటుగా వారికీ వెండి ఆభరణాలు కూడా దొరికినట్లు చెబుతున్నారు. ఈ బంగారం ఇప్పుడు దొరకడానికి కారణం లేకపోలేదు రాజుల కాలం నాటి రాజుల కోటలు ,అదేవిధంగా పలు రకాల దేవాలయాలు తుఫాన్ మరియు వరదల కారణంగా సముద్ర భూ గర్భం లో కలసి పోయాయి.




అయితే ప్రస్తుతం అందులోని వస్తువులు వరదల కారణంగా తీరా ప్రాంతాలకు కొట్టుకొస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. గతేడాది నవంబర్ నెలలో కూడా ఇలాంటి బంగారం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా వారు సముద్రం వొడ్డున చిన్న చిన్న బంగారు రేణువులను కూడా వారు కనిపెట్టారు. ప్రస్తుతం కూడా అలంటి బంగారం రేణువులు ఇప్పుడు కూడా దొరకడం విశేషం. తాజాగా బంగారం దొరుకుతుందనే ప్రచారంతో ఎక్కెక్కడినుంచో ప్రజలు అక్కడకు చేరుకొని బంగారం కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: