ప్ర‌స్తుతం ఉన్న ఈ హైటెక్ యుగంలో ప్ర‌తి ఒక్క‌రూ ఫేమ‌స్ కావాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ఫేమ‌స్ కావాలంటే సినిమాలు లేదా రాజ‌కీయం ఎంచుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా అంటూ రాత్రికి రాత్రే చాలా మంది ఫేమస్ అయిపోత‌న్నారు. పాపుల‌ర్ కావాల‌ని సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌ముఖులు ర‌కర‌కాల పాట్లు ప‌డుతున్నారు. ఆటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్ పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగా అయిపోయాయి. ఇప్పుడు ముద్దులు, కౌగిలింత‌లు కామ‌న్ అయిపోయాయి. ఇంకా కొందు ముందుకు వెళ్లి న్యూడ్ షో చేస్తుంటే.. మ‌రి కొంద‌రు శృంగార వీడియోలను ఆశ్ర‌యిస్తున్నారు.


    వీట‌న్నింటిని మించి తాజాగా ఓ పాప్ సింగ‌ర్ చేసిన ప‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. అమెరిక‌న్ పాల‌పుల‌ర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెనెయిస్ట్ లీడ్ సింగ‌ర్ సోఫియా యురిస్టా.. ఈ మ‌ధ్య త‌న బ్యాండుతో క‌లిసి ఫ్లోరిడా లో ఓ షో నిర్వ‌హించారు. షో మ‌ధ్య‌లో సోఫియా ఓ ఫ్యాన్‌ను పైకి ర‌మ్మ‌ని పిలిచింది. సెల‌బ్రెటీ  పిలుపుతో ఉత్సాహంగా పైకి వెళ్లి ప‌డుకోవ‌డంతో అంద‌రు చూస్తుండ‌గానే ప్యాంట్ విప్పి ముఖంపై టాయిలెట్ పోసింది. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డ ఉన్న‌వారు ఒక్క‌సారిగా షాక్‌తిన్నారు. ఇదెక్క‌డి దారుణం అంటూ మండిప‌డుతున్నారు. లైవ్ షోలో ఒక లేడీ ప్యాంట్ విప్ప‌డం ఏంట‌ని అదీ మ‌ళ్లీ ఒక వ్య‌క్తిపై మూత్రం పోయ‌డం ఏంటి అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

 
   ఈ ఘ‌ట‌నపై ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే, ఈ ఇష్యూపై స్పందించిన సోఫియా `నా సంగీత ప్ర‌పంచంలో పాత ప‌ద్ధ‌తిని చెరిపేసి.. కొత్త ప‌ద్ధ‌తికి శ్రీ‌కారం చుట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఆరోజు కూడా అదే చేశాను. కానీ అది అతిగా మారిపోయింది. దీనికి వ్య‌క్తిగ‌తంగా సారి చెబుతున్నాను అని అభిమానులు, నెటిజ‌న్ల‌ను క్షమించాలని విజ్ఞ‌ప్తి చేసింది. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వ‌స్తుందోన‌ని నెటిజ‌న్లు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: