సమాజంలో  స్త్రీ,   పురుషులూ సమానమే.  అని మీరంటే మీరు కూడా  పురుషులతో సమానంగా కష్టించి పని చేయాలి.... ఆ  మాట అనింది వేరెవరో కాదు. ఒక బాధ్యతాయతమైన పదవిని వెలగబెడుతున్న మంత్రి.  ఇది ఏ పరాయి దేశంలో నో కాదు.  మనదేశంలో నే ఓ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ మంత్రి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మధ్య ప్రదేశ్ లోని అనుపూర్ జిల్లా కేంద్రంలో స్థానిక మహిళలు మంత్రికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సభ కార్యక్రమం చివర్లో ముఖ్యఅతిథి అయిన సదరు మంత్రిని మాట్లాడమని మైకిచ్చారు. ఇంకేముందు మంత్రి బిసాహులాల్ సింగ్ రెచ్చి పోయారు. తను ప్రసంగిస్తున్నది మహిళా కార్యక్రమం అని కూడా చూసుకోకుండా మహిళలపై తీవ్ర విమర్శలు చేశారు. అగ్ర వర్ణ మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలని సూచించారు.  ఠక్కర్, ఠాకూర్ కుటంబాలు అగ్రవర్ణాలకు చెందినవని  చెప్పారు. ఆ కుటుంబాలలో మహిళలు గడపదాటి వెలుపలికి రారని తెలిపారు. తక్కవ జాతి కులాల మహిళలు మాత్రమే పొలం పనుల్లో జీవనం సాగిస్తారని అన్నారు. మహిళలు సమాన హక్కుల  కోసం పోరాడుతున్నారని, ఇది తగదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పురుషులతో సమానంగా మహిళలు ఉండాలను కుంటే ముందుగా పురుషులు చేసే కష్టం చేయాలని ఉచిత సలహా  ఇచ్చారు.

మంత్రి బిసాహులాల్ సింగ్  కొత్తగారాజకీయాలలోకి వచ్చి న వ్యక్తి కాదు. మధ్య ప్రదేశ్ రాజకీయాలలో సీనియర్.   కాంగ్రెస్ మూలాలు కల్గిన వ్యక్తి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియాతో  పాటు గా  భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు
 
మంత్రి వ్యాఖ్యలపై సభకు హాజరైన వారెవ్వరూ అభ్యంతరం చేయక పోవడం గమనార్హం. అయితే మంత్రి ప్రసంగం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు మంత్రి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ సదరు మంత్రి  ఇంకా  తన వ్యాఖ్యలను ఇంకా వెనక్కి తీసుకోక పోవడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: