సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటన లు కూడా క్షణాల వ్యవధిలో  అరచేతిలో వాలి పోతున్నాయి  ముఖ్యంగా ఇలా సోషల్ మీడియా లోకి వస్తున్న కొన్ని వీడియోలు అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక మరి కొన్ని వీడియోలు అటు అందరిని పగలబడి నవ్వేలా చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. పాపం ఈ వీడియో అందరూ భర్తలకు బాగా కనెక్ట్ అయిపోతుంది. అంతేకాదు ఇక అందరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కాసేపు నవ్వుకోవడమే కాదు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.



 ఇంతకీ ఈ వీడియోలో ఏం దాగి ఉంది అని అంటున్నారా.. ఈ వీడియోలో ఏం వుంది అంటే ఇన్ని రోజుల వరకు ఎంతో మంది భర్తలు దాచిపెట్టిన రహస్యం బయటికి వచ్చేసింది. అవునా ఇన్ని రోజుల వరకు భర్తలు అందరు దాచిపెట్టిన అతి పెద్ద రహస్యం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. భార్య చేతిలో దెబ్బలు తిన్న విషయం. ఏంటి షాక్ అయ్యారా.. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం అవును ఇది నిజమే అని అనుకుంటారు.. సాధారణంగా మనం సినిమా లో చూస్తూ ఉంటా భార్యలు భర్తలను కొట్టడమే కాదు ఒక ఆట ఆడుకుంటారు.  నిజజీవితంలో కూడా ఇలా జరుగుతుందా అంటే ప్రతి భర్త అబ్బే అలాంటిదేమీ ఉండదని అంటూ చెబుతూ ఉంటాడు.


 కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే మాత్రం భర్తలు అసలు విషయాన్ని దాచి పెట్టారు అన్నది మాత్రం అర్థమవుతోంది. ఒక వ్యక్తి భార్య కొట్టిందని వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న వ్యక్తులు అతని ఓదారుస్తూ పెళ్ళాం కొడుతది ఏం చేస్తాం జమానా అట్లా అయిపోయింది పెళ్ళాం కొట్టింది అని చెప్పేసి గింతగనం ఏడుస్తారా అంటూ చెప్పడం మాత్రం వీడియో లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక చుట్టుపక్కల పరిసరాలన్నీ చూస్తుంటే భార్య బాధితుడు పోలీస్స్టేషన్కు వెళ్లగా అతనికి సర్దిచెప్పి ఉదయాన్నే రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను ఎంతో మంది భర్తలు తమ వాట్సాప్ స్టేటస్ లుగా పెట్టుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: