భారతదేశంలో వివాహాల సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. ఇక వివాహ వేడుకల సమయంలో మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించడానికి ఇంకా అందరికంటే కూడా అత్యంత అందంగా కనిపించడానికి ప్రజలు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ వున్నారు. ఇక వివాహ వేడుకకు హాజరైన స్నేహితులు, కుటుంబం లేదా బంధువులను తమ డ్రెస్సింగ్ తో మెప్పించాలని చూస్తున్నారు. ఇప్పుడు, ఒక మహిళ తన చీరతో హెన్నా (మెహందీ) బ్లౌజ్‌ని ధరించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.అంటే ఆమె చీర కట్టుకుంది కానీ బ్లౌజ్ ధరించలేదు. బ్లౌజ్ స్థానంలో బ్లౌజ్ లాగా కనపడే మెహందీని పెట్టుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వివాహ సమయంలో ఆనందించే అత్యంత అందమైన సందర్భాలలో మెహందీ కూడా ఒకటని చెప్పాలి.ఇంతకుముందు ఈ ఆచారం చేతులు మరియు కాళ్లకే పరిమితం.

అయితే, ఈ వీడియోతో, ఈ మహిళ వేసుకున్న ఈ మెహందీ బ్లౌజ్ త్వరలో చాలా మందికి బోల్డ్ ఫ్యాషన్ ఎంపికగా మారబోతోంది. ఇక ఈ వీడియోను thanos_jatt అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు, ఈ వీడియోకు 1,900 కంటే ఎక్కువ మంది లైక్‌ చేశారు.అయితే చాలా మంది వినియోగదారులు మాత్రం ఆ మహిళను ఆమె బోల్డ్ ఎంపికని చూసి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ట్రోల్ కి అడ్డా అయిన కామెంట్ సెక్షన్ లో ఈ బోల్డ్ బ్యూటీని తెగ ఆడుకుంటున్నారు. ఇంకా ఆమెను అపహాస్యం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, మహిళ తన శరీరంపై బ్లౌజ్ స్థానంలో హెన్నా డిజైన్‌ను వేసి కవర్ చేస్తూ ధైర్యంగా చూపిస్తున్నట్లు కనిపించింది. మహిళ సాంప్రదాయ బ్లౌజ్‌ని విస్మరించి, బదులుగా ముందు మరియు వెనుక భాగంలో హెన్నా డిజైన్‌ను ధరించింది. భుజాలు మరియు ముంజేతులతో సహా ఆమె పైభాగంలో హెన్నాతో గీసిన తెల్లటి చీరలో స్త్రీ కనిపించింది, ఇది డిజైనర్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: