హార్దిక్ పాండ్యా.. ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు ఫోర్లు సిక్సర్లు తప్ప  అతగాడికి సింగిల్స్ అనేది తెలియదు. ఇక పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్య సరిగ్గా సరిపోతాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది.  అంతలా హార్దిక్ తన బ్యాట్ తో భీభత్సం సృష్టిస్తూ ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా లో అద్భుతంగా రాణించడమే కాదు ఐపీఎల్ లో  కూడా ముంబై ఇండియన్స్ తరపున తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా.


 జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బ్యాటింగ్ కు దిగుతూ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో దిగ్గజ జట్టుగా గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్య ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్నప్పటికి ఇప్పటివరకు బౌలింగ్ జోలికి వెళ్ళలేదు హార్దిక్. దీంతో ఫిట్నెస్  హార్దిక్ పాండ్యా నిరూపించుకోవాలి అంటూ బిసిసిఐ కూడా తెలపడం గమనార్హం. అయితే ఇక హార్దిక్ పాండ్యా సరైన ఫామ్ లో లేకపోవడంతో ఇక ఇటీవలే ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా ని వదులుకోవడం అభిమానులను షాక్కు గురి చేసింది.



 ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర వహించిన హార్దిక్ పాండ్యా ని వదులుకోవడం మాత్రం సంచలనంగా  మారిపోయింది. అయితే ఇటీవలే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సి ఉండగా రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా లను మాత్రమే రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్.. తనను ముంబై ఇండియన్స్ జట్టు వదిలేయడంతో ఇటీవలే హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక వీడియో ని సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో ఆడిన క్షణాలు ఎప్పటికీ నా జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాను. ఎన్నో ఆశలతో ఒక యంగ్ స్టర్ గా 2015లో ముంబై ఇండియన్స్ లోకి అడుగు పెట్టిన నేను ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా ఎంతగానో గుర్తింపు పొందాను. ఇక ఆరేళ్లలో ముంబై ఇండియన్స్ కి ఆల్రౌండర్గా ఎంతగానో చేశాను. ఆ జట్టుతో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది.. ముంబై ఫాన్స్ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోలేను. ఈరోజు ముంబై జట్టు నన్ను వదిలేసినప్పటికీ వారితో ఉన్న ఎమోషన్ మాత్రం నాతోనే ఉంటుంది అని ఒక ఎమోషనల్ వీడియో ని విడుదల చేశాడు హార్థిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: