దొంగతనం చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. దానికి ఓ ఆర్ట్ ఉండాలి. ఇక ఎవరికీ తెలియకుండా దొంగతనం చేయడానికి దొంగలు చాలా కష్టపడుతుంటారు.అయితే దొంగతనం చేయడం అనేది అనైతికం అని చెప్పాలి. అది చట్ట వ్యతిరేకమని తెలిసినా కొంత మంది దొంగతనాలు చేస్తూనే ఉంటారు. ఇక ఒకప్పుడు దొంగతనాలు చేసిన వారిని పట్టుకోవడం అంటే పెద్ద తతంగంతో కూడిన అంశంగా ఉండేది. పోలీసులు కూడా వ్యయప్రయాసలు పడి అప్పుడు దొంగలను పట్టుకునే వారు. కానీ ప్రస్తుతం డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఆధారంగా దొంగలను పట్టుకునే తీరు కూడా మారుతోందని చెప్పాలి. ఇక దొంగలను పట్టుకునే క్రమంలో సగం పనిని సీసీటీవీ కెమెరాలే చక్కగా చేసేస్తున్నాయి.ఇలా సీసీ టీవీ కెమెరాల్లో చిక్కిన చాలా వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయి దొంగతనం చేస్తుండగా కెమెరాల్లో చిక్కిందా వీడియో. 

గోల్డ్‌ రింగ్‌ను కొనుగోలు చేసేందుకు గాను ఆ అమ్మాయి జువెలరీ షాప్‌కి వెళ్లింది. అక్కడ ఉన్న రింగ్‌లను గమనిస్తూ నెమ్మదిగా ఓ రింగ్‌ను కొట్టేసి దొంగతనం చేసింది. అయితే అప్పటికే ఓ డూప్లికేట్ రింగ్‌ను తెచ్చుకున్న ఆ యువతి.. చనీచప్పుడు కాకుండా అసలైన రింగ్‌తో రీప్లేస్‌ చేసేసింది.అయితే ఈ ప్రక్రియను ఆ యువతి ఏమాత్రం అనుమానం రాకుండా చేసేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి.ఇక అక్కడ దొంగతనం జరిగినట్లు ఆ వీడియోను ఒకటి రెండు సార్లు చూస్తే కానీ ఎవరికీ అర్థం కావడం లేదు. మీరు కూడా ఓసారి ఆ వీడియోను చూసి ఆ అమ్మాయి రింగును దొంగతనం చేసిన సన్నివేశాన్ని గుర్తించగలరేమో ప్రయత్నించి చూడండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అంతటా కూడా బాగా చక్కర్లు తెగ వైరల్ అవుతుంది.


https://twitter.com/kumarayush084/status/1467847079242256387?t=dnxR5UTfDu6_HDvE5810aw&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: