మహిళను ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడడం ఒకవేళ మహిళలు నిరాకరిస్తే దారుణంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు నేటి రోజుల్లో ఎంతోమంది ప్రబుద్ధులు . మహిళలను మానసికంగా శారీరకంగా వేధించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఓ యువకుడు  చేసిన పనికి సభ్య సమాజమే  సిగ్గుపడుతుంది. ఓ మహిళను వెంటాడుతూ వచ్చిన ఓ యువకుడు చివరికి ఆ మహిళ ఇంటి ముందు అందరూ చూస్తుండగానే దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా హస్తప్రయోగం చేశాడు. ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది


 మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే భూపాల్ లోని షాజాహనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే సదరు మహిళ పై కన్నేసిన ఓ యువకుడు గత కొన్ని రోజుల నుంచి వెంటపడుతున్నాడు అసభ్యంగా మాట్లాడుతూ ప్రవర్తించడం వంటివి చేస్తున్నాడు. ఇటీవలే మరింత తెగించాడు ఆ యువకుడు. ఏకంగా భూపాల్ లో ఆ మహిళ ఉంటున్న ఇంటి వద్దకు స్కూటీపై వచ్చాడు. ఆ మహిళ ఇంటి మేడ మీద నిలబడి ఉండడం గమనించాడు.


 ఈ క్రమంలోనే సదరు మహిళను చూస్తూ హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అయితే భూపాల్ లో ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతం కావడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు ఇక ఆ యువకుడు. అతని ప్రవర్తనతో షాక్ అయిన మహిళ వెంటనే అతడిని పట్టుకునేందుకు కిందకు వచ్చింది. కానీ అప్పటికే స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.. ఈ ఘటనపై మహిళా పోలీసులకు ఫిర్యాదుచేసింది. గత కొన్ని రోజులుగా యువకుడు తనను ఇబ్బంది పెడుతున్నాడని చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది మహిళ. సిసిటివి ఫుటేజీ గమనించి ఆ ఆకతాయిని తీసుకుంటామంటూ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: