డబ్బులు ఉంటే ఏదైనా చెయొచ్చు..ఎన్ని రకలా విద్యలు అయిన పడవచ్చు. ఉన్నొడికి ఉన్నంత అని పెద్దలు ఊరికే అనలేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో చిన్న సూది కూడా ఖరీధు తో కూడుకున్నది. అందుకే అంటారు సంపన్నుల ఇళ్ళల్లోని వాళ్ళకు గంజి కష్టాలు తెలియవు. విషయానికొస్తె రిలయన్స్ అధినేత  అనిల్ అంబాని ఇంట్లో అన్నీ చాలా ఖరీదైనవి. ఆ విషయం అందరికి.. వస్తువుల మాట పక్కన పెడితే నీళ్ల బాటిల్ యమ రేటు.. ఆ బాటిల్ ఖరీదు తో మన మహా నగరం లో ఒక ఇల్లును కొనవచ్చు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంత ఖరీదైన ఆ నీళ్ల బాటిల్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం...


750ఎమ్ఎల్ నీళ్ల బాటిల్ ఖరీదు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అంత రేటు అది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44 లక్షలు. ఏంటి? అంత చిన్న బాటిల్ అంత రేట్ ఎందుకు అనే సందెహాలు వస్తున్నాయి కదా.. అయితే ఆ నీళ్ళు మామూలు నీళ్ళు కాదట.. అవి ఇక్కడ దొరకవు.. వేరే దేశం లో దొరికే ఖరీదైన నీళ్ళు అవి.దీని పేరు 'ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని అంటారు.నీళ్ళు తాగిన తర్వాత బాటిల్ ను అస్సలు పడేయ్యరు.. ఎందుకంటే అది బంగారం తో తయారు చేసిన స్పెషల్ బాటిల్ అట..


రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, చైర్‌పర్సన్ అయినా నీతా అంబానీ క్రికెట్ స్టేడియంలో ఆమె ఈ బాటిల్ పట్టుకొని ప్రత్యక్ష్య మైంది. అప్పుడు కెమరాలు ఆమె ఫోటోను క్లిక్ మనిపించారు. దాంతో ఈ బాటిల్ కథ బయటకు వచ్చింది. అంత ఖరీదు ఎందుకు అంటే..బాటిల్ ను 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బాటిల్ డిజైన్ చేసింది ఎవరో కాదు డిజైనర్ ఫెర్నాండో..మెక్సికొ లో ఇది తయారు చేసి వేలం వేస్తారు. అలా వచ్చిన డబ్బులను భూమి రక్షణ కోసం వినియొగిస్తారు. అలా నీతా అంబాని కొన్నది..ఇంకో విషయం ఈ నీళ్ళు వసంతకాలంలో ఫిజి, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి తీసుకుంటారట..2010 లో ఖరీదైన నీళ్ల బాటిల్ గా గిన్నీస్ బుక్ రికార్డు లోకి ఎక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: