మనుషులు ఈ మధ్య స్వార్దంగా ఆలొచిస్తున్నారు. తమకు మాత్రమే అనుకున్నది దక్కాలని తెగ ప్రయత్నాలు చెస్తున్నారు. ప్రేమ , జాలి అనేది ఈరోజుల్లో బొత్తిగా కరువైంది. ఎంత సేపు డబ్బులను సంపాదించాలని నానా హైరానా పడిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నో తప్పులను చేస్తున్నారు. కానీ జంతువుల విషయంలో అలా కాదు.. మాటలు మాత్రమ్ రావు కానీ మనసులో వాటికి అవే సాటి. మరో జంతువు తో స్నేహం చేస్తె.. అవి చివరికి మట్టిలొ కలిసె వరకూ అలానే ఉంటాయి.


ఇలాంటి విషయంలో కుక్క, పిల్లి. ఏనుగువంటి జంతువులు పలు సందర్భాల్లో తెలియజేశాయి.. తాజాగా ఓ నెమలి.. తన చిరకాల స్నేహితుడికి వీడ్కోలు పలికిన విధానం.. మనసుకు హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌ లోని కుచెరా టౌన్‌కు చెందిన రామ్ స్వరూప్ బిష్ణోయ్ జంతు ప్రేమికుడు. గత కొన్ని సంవత్సరాలు గా రెండు మూడు నెమళ్లు రోజూ రామ్ ఇంటికి వస్తున్నాయి. వాటికీ రోజు ప్రేమగా తినడానికి గింజలు వేస్తున్నాడు. దీంతో రామ్ స్వరూప్ కి నెమళ్ళు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాయి.


అయితే అందులో ఒక నెమలి వయస్సు పైన బడటం తో మరణించింది.నెమలి మృతితో మరొక నెమలి కన్నీరు పెట్టింది. నెమలి మృత దేహాన్ని పూడ్చడానికి ఇద్దరు యువకులకు చెప్పాడు. నెమలి దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు .. ఒక నెమలి కన్నీరు పెడుతూ వారిని వెంబడించింది. నెమలి మృత దేహాన్ని ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉంది. ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న. నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది… హార్ట్‌ టచింగ్‌ వీడియో అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. అయ్యో పాపం.. మీరు ఆ వీడియో ను ఒకసారి చూడండి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: