సాదారణంగా స్వీట్స్ అంటే బెల్లం తో లేదా చక్కెర తో చేస్తారు.. కానీ బంగారం తో స్వీట్స్ చెయ్యడం ఎప్పుడైనా విన్నారా.. అసలు అలాంటివి ఉన్నాయని ఎక్కడైనా విన్నారా.. అవును ఆ స్వీట్స్ ఇప్పుడు ఉన్నాయి. వాటికి రుచి తో పాటుగా ఖరీధు కూడా ఎక్కువ అని అంటున్నారు. ఆ స్వీట్స్ కు అంత ఖరీధు ఎందుకు.. వాటి లో వుండే ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మన దేశంలో మిఠాయిలను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ అనేక రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయి.


కొన్ని స్వీట్స్ పై వెండి రేకు ఉండడం చూసే ఉంటారు. ఉదాహరణకు కాజూ కట్లీ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బంగారు పూత పూసిన మిఠాయిలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటీ షాకయ్యారా ? కానీ మీరు చదివింది నిజమే. అక్షరాల బంగారంతో పూత పూసిన మిఠాయిల కోసం జనాలు అధిక సంఖ్యలో షాపు వద్దకు వెళ్తున్నారు. ఈ ఢిఫరెంట్ ఎక్కడో విదేశాల్లో అనుకంటే పొరబాటు పడినట్టే.. అవి మన దేశంలోనే అందుబాటులో ఉన్నాయి. ఆ బంగారు మిథాయిలకు సంబంధించిన వీడియోలు , ఫోటో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


విషయానికొస్తే.. ఢిల్లీలోని మౌజ్ పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్స్ షాపులో ఈ బంగారు మిఠాయిలను విక్రయిస్తున్నారు. ఒక నిర్ధిష్టమైన స్వీట్ పై బంగారు పూత (గోల్డ్ ఫాయిల్‏తో) పూస్తున్న వీడియో ఇప్పుడు ఇన్‏స్టాలో చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత దానిపై కొంత కుంకుమ పువ్వును అందంగా అలంకరిస్తున్నారు. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ స్వీట్స్ కేజీ రేట్ రూ. 16,000. ఈ స్వీట్స్ వీడియోను ఫుడ్ బ్లాగర్ అర్జు్న్ చౌహన్ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసాడు.అంత రేటు పెట్టి తినడం అవసరమా..తింటే ఎమౌథుందొ అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు... ఆ బంగారు స్వీట్స్ తయారి వీడియో ను మీరు చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: