ఈ మధ్య సోషల్ మీడియాలో వింత వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా జంథువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అందు లో కొన్ని వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఒక పాము వీడియో ఒకటి చక్కర్లు కొడుతున్నాయి. ఒక పాము తనను తాను తింటున్నట్లు కనిపించించే వీడియో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌ లో అప్‌లోడ్ చేసిన వీడియోకు ఇప్పటి వరకు 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.


నల్లని చర్మం పై తెల్లని మచ్చలు ఉన్న ఒక పాము తనని తానే తినెందుకు ప్రయత్నించింది. వెనుక భాగాన్ని తనకు అదే తింటున్న దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియా లో అప్‌లోడ్‌ చేశారు. యజమాని రాబ్ క్లార్క్ వెనిటాక్స్ పామును ఆపడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ వీడియో లో పాము తన తోక భాగాన్ని తినడాన్ని చూడవచ్చు. దాని శరీరంలో ఎక్కువ భాగం మింగేసింది. అయితే ఆ పాము యజమాని పాము తల పై హ్యాండ్ శానిటైజర్‌ ను పూసేందుకు ప్రయత్నించాడు. సాదారణంగా చెప్పాలంటే ఆ శానిటైజర్‌ను ఇష్టపడవు.


శానిటైజర్‌ వాసన పడదు. అందుకు ఆ వ్యక్తి పాము తలపై శానిటైజర్‌ పూయగానే వెంటనే నోటి నుంచి విడిచి పెట్టింది ఆ పాము. ప్రమాదవశాత్తూ పాము తలపై కాకుండా కళ్లపై శానిటైజర్‌ ను పెట్టానని, అందుకే అది ఎగిరి గంతేస్తోందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. పాములు వాటి కళ్లను రక్షించే స్పష్టమైన పొలుసుల ను కలిగి ఉంటాయి. కాబట్టి దాని కళ్ళు హ్యాండ్ శానిటైజర్ ద్వారా అస్సలు ప్రభావితం కాలేదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆకలి ఎక్కువగా వేయడం వల్ల లేదా వేడి ఎక్కువ అవ్వడం వల్ల అలా చేసి ఉంటుందని ఆయన వివరించారు. మీరు ఆ వీడియో ను చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి: