ఇక ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ కేప్ టౌన్ టెస్టులో , రెండో ఇన్నింగ్స్‌లో ఇండియన్ టాలెంటెడ్ టెస్టు బ్యాట్స్ మ్యాన్ చెతేశ్వర్ పుజారా భారత అభిమానులను చాలా తీవ్రంగా నిరాశపరిచడం అనేది జరిగింది.ఇక ప్రోటీస్ జట్టుకు చెందిన కీగన్ పీటర్సన్ చిరుత పులి లాంటి ఫీల్డింగ్ కి బలయ్యాడు.మూడో రోజు ఆట మొదలైన రెండో బంతికే పుజారా పెవిలియన్ చేరి ఫ్యాన్స్ ని చాలా తీవ్రంగా నిరాశ పరిచాడు. మూడో టెస్టు మూడో రోజు మ్యాచ్ లో రెండో బంతికే మార్కో యాన్సన్‌ బౌలింగ్‌లో చెతేశ్వర్ పుజారా అవుటవ్వడం జరిగింది.

కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి పుజారా పెవిలయన్ చేరాడు. దీంతో టీమ్ ఇండియా పరిస్థితి మరింత దిగజారడంతో పాటు భారీ స్కోరుపై ఆశలు కూడా అడియాసలయ్యాయి.ఇక లెగ్ స్లిప్‌లో నిలబడి చెతేశ్వర్ పుజారా క్యాచ్‌ని కీగన్ పీటర్సన్ చాలా అద్భుతంగా అందుకున్నాడు. అతని క్యాచ్ చూసిన వారందరూ కూడా షాక్ లో బాగా ఆశ్చర్యపోయారు. పుజారా కూడా ఇలా ఔట్ అయ్యాడంటే అస్సలు నమ్మలేకపోయాడు.

ఇక మూడో రోజు ఆటను చెతేశ్వర్ పుజారా ఇంకా విరాట్ కోహ్లీ ప్రారంభించారు. ఇద్దరూ కూడా రెండో రోజు ఆటను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించారు.ఇక రెండో రోజు సాయంత్రం వరకు వీరిద్దరూ రాణించడంతో మూడో రోజు కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. అయితే రెండో బంతికే ఇండియాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్కో యాన్సన్ బంతిని అతను షార్ట్ పిచ్‌లో ఆడటం జరిగింది. ఆ బాల్ బాగా జంప్ చేసి లెగ్ సైడ్ కి వెళ్లింది.

ఆ బాల్ స్పీడ్ ఇంకా అలాగే దాని బౌన్స్ పుజారాను ఆశ్చర్యపరిచాయి. పుజారా చేతికి తగిలిన ఆ బాల్ లెగ్ స్లిప్ వైపు వెళ్లింది. ఇక ఇక్కడ నిలబడిన కీగన్ పీటర్సన్ కుడివైపుకు దూకి ఆ క్యాచ్ ని చాలా అద్భుతంగా పట్టాడు.ప్రస్తుతం అతను క్యాచ్ పట్టిన ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ బాగా వైరల్ అవుతుంది. క్రికెట్అభిమానులు కూడా గుడ్ ఫీల్డింగ్ అంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

https://twitter.com/OfficialCSA/status/1481548049046458370?t=3_L4ueY-SWvR2LZySpgC8Q&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: