సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు మరియు జంతువులకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి బాగా వైరల్ గా మారింది. అది చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. అదేంటంటే మూడు తలల పాము ఫొటో ప్రస్తుతం ఈ పిక్ సోషల్‌మీడియా లో తెగ హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఫొటో అసలు నిజం తెలిసి నెటిజన్స్ అందరూ కూడా నోరేళ్లబెడుతున్నారు.


అయితే ఫొటోలో మనకు పాములా కనిపిస్తోంది వాస్తవానికి ఒక కీటకమని సమాచారం.ఇది చాలా సాధారణమైన ఒక పురుగు. దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేదు. కానీ కొన్ని విషయాలు జనాలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కీటకం పేరు అటాకస్ అట్లాస్(Attacus Atlas). దీనిని అట్లాస్ మాత్ అని కూడా అంటారట.ఇది సీతాకోక చిలుక జాతి(Butterfly species)కి చెందినదని ఇది వయోజన దశలో రెండు వారాలు మాత్రమే ఇలా కనిపిస్తుందట. ఎందుకంటే గుడ్లను కాపాడటానికి పాముల రూపంలో కనిపిస్తూ రక్షించడం వాటి పని.


మాంసాహార జీవులను భయపెట్టడానికి ఇలా పాము తలలా అది కనిపిస్తుంది. ఈ కీటకాలు(Insects) ఎక్కువ భాగం ఆసియా ఖండంలో మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయిన వెంటనే ప్రజలు దానిపై విపరీతంగా కామెంట్‌ చేస్తున్నారట.. అంతేకాదు ఇది కీటకమంటే అస్సలు ఎవరూ నమ్మలేకపోతున్నారు.అయిన కూడా ఇలాంటి వింతలు సృష్టిలో మనకు తెలియనివి చాలానే వున్నాయి. మనకి తెలియని రహస్యాలు ఈ ప్రపంచంలో చాలానే దాగి వున్నాయి. అవి మనకు ఎప్పుడో ఒకసారి ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం తెగ వైరల్ చేస్తూ ఉంటాం.ఇలాంటి వింతలు కనపడితే వాటిని భద్రంగా దాయడంతో భవిష్యత్ తరాల వారికీ చూపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: