ప్రముఖ అందమైన సిటీ గా గుర్తింపు తెచ్చుకున్న దుబాయి దేశంలో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు అత్యంత ఎత్తయిన బుర్జ్ గా ఇది గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. దుబాయ్ లో వున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ బుర్జ్ ఖలీఫా మొత్తం 829.8 మీ (2,722 అడుగులు) మరియు పైకప్పు ఎత్తు..828 మీ (2,717 అడుగులు) వెడల్పుతో ఈ బుర్జ్ ఖలీఫా ఉంది.2009లో అగ్రస్థానంలో నిలిచినప్పటి నుండి ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణం మరియు భవనం ఇది రికార్డు సృష్టించింది.


అయితే ఇంతటి ఎత్తైన భవనం పై నిలబడాలంటే సాధ్యమా.. అంతేకాదు ఒక అమ్మాయి ఎత్తైన భవనం మీద నిల్చొని ధైర్యంగా నవ్వుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. సాధారణంగా ఇలాంటి ఎత్తయిన  బుర్జ్ పైన ఎక్కాలి అంటే చాలా భయం తో సాహసంతో కూడుకున్న పని.. కానీ ఒకసారి అయితే సాహసం చేయొచ్చు కానీ ఈ అమ్మాయి రెండుసార్లు సాహసం చేసి తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఆ అమ్మాయి ఎక్కడానికి గల కారణాలు , ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా బుర్జ్ ఖలీఫా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఒక అమ్మాయి భయం లేకుండా దీని పై  నిలబడి ఏకంగా యాడ్ చేసి  గుర్తింపు తెచ్చుకుంది నికోల్ స్మిత్..అయితే  ఇదంతా గతంలో అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మరో సారి ఈ ఫీట్ ను  ఆమె సాధించడం గమనార్హం. ఇక దుబాయ్ ఎక్స్పో 2020 ను  ఆమె ప్రమోట్ చేయడానికి మరోసారి ఈ విమానయాన సంస్థ రూపొందించిన యాడ్ లో నటించి.. పైగా నేను ఇంకా ఇక్కడే ఉన్నా.. మీరు దుబాయ్ ఎక్స్ పో కి రండి అని ప్లకార్డులను కూడా ప్రదర్శించింది నికోల్.. ఈసారి ఈమె వెనకాల ఎమిరేట్స్ విమానం చక్కర్లు కొట్టడం మనం గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: