ప్రేమ కోసం ఈరోజుల్లో ఎన్నెన్నో చేస్తున్నారు.. ఒకప్పుడు షాజహాన్ లాంటి అమర ప్రేమికులు, భార్య గుర్తుగా ఒక తాజ్ మహల్ ను కట్టినట్లు ఎందరో ప్రేమికులు వారి ప్రేమ గుర్థుగా ఈరోజుల్లో కూడా ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నారు. నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ మరువలెదు. వాటి కోసం ఏదైనా చేయాలనీ అనిపిస్తుంది. కానీ ఈరోజుల్లో కూడా అలాంటి ప్రేమలు ఉన్నాయా అనే సందెహాలు చాలా మందికి కలగవచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. టైం పాస్ కోసం ప్రేమించి తీరా మోజు తీరాక మొహం ఛాటేస్తున్నారు.


అయితే, ఇప్పుడు వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మకు కిడ్నీ ఫైయిల్ అయితే అతను ఉదార స్వభావం తో ఆమెకు కు తన కిడ్నీ ఇచ్చాడు. అది కూడా ఆ మహాతల్లి మర్చిపోయి.. తనను రిజెక్ట్ చేసింది. అది కూడా ఆ వ్యక్తి బాధపడలేదు. నిజంగా ఈరోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉండటం గ్రేట్ అనే చెప్పాలి. ఈ బాధాకరమైన ఘటన మెక్సికోలో వెలుగు చూసింది.మెక్సికోలో టీచర్‌గా పనిచేసే ఉజియెల్ మార్టినెజ్‌ది ఈ బాధాకరమైన ఘటన..


అతను తన ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని ప్రెమించాడు. ఆమె తో చాలా రోజులు బాగానే వున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆమె తల్లికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దాంతో భాధపడిన అతను..తన కిడ్నీకి గర్ల్‌ఫ్రెండ్ తల్లికి దానం చేశాడు. ఆ తర్వాత నెలతిరిగేసరికే గర్ల్‌ఫ్రెండ్ అతనికి షాకిచ్చింది. మార్టినెజ్‌కు బ్రేకప్ చెప్పేసి ఎంచక్కా వేరే వ్యక్తిని పెళ్లాడింది. ఇటీవల టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ఒక ఛాలెంజ్‌లో భాగంగా తన అనుభవాన్ని మార్టినెజ్ వెల్లడించాడు. ఆమె అలా చేసినా కూడా అతను తనపై కోపాన్ని లేదా ద్వెషాన్ని కానీ చూపించలేదు.. నిజంగా ఇలా ఉండటం గ్రేట్ .. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: