సాధార‌ణంగా అంద‌రూ ఆయురారోగ్యాల‌తో నిండు నూరేండ్లు క‌ల‌కాలం జీవించాల‌ని కోరుకుని అందుకు అనుగుణంగా ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లోనైతే కొవిడ్‌, ఒమిక్రాన్‌, బ్లాక్ ఫంగ‌స్ వైర‌స్ లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పీడిస్తున్న త‌రుణంలో ఇక ఎంత జాగ్ర‌త్త ఉంటే అంత బెట‌ర్ అని.. ఓ వైపు డాక్ట‌ర్లు.. మ‌రొక శాస్త్రవేత్త‌లు సైతం హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో కూడా కొంద‌రూ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధ‌ప‌డుతూనే ఉంటారు. కానీ ఇక్క‌డ ఒక వ్య‌క్తి ఎలాంటి ప‌రిశుభ్ర‌త కానీ, మంచి ఆహారం కానీ తీసుకోకుండానే ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. 87 ఏండ్లు క‌లిగి ఉన్న ఆ వ్య‌క్తి  అంత అప‌రిశుభ్రంగా ఉండి కూడా ఆరోగ్యంగా ఉండ‌టాన్ని చూసి శాస్త్రవేత్త‌లు సైతం ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు.

ఇరాక్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు 67 ఏళ్ల‌కు పైగా స్నాన‌మే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా అత‌ను పందికొక్కులు, కుందేళ్ల‌ను తింటూ, నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. గ‌త 67 సంవ‌త్స‌రాలుగా అత‌ని జీవన శైలి ఇదేన‌ట‌. అయితే అత‌ని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్త‌లు, ప‌రిశోధ‌కులు ఆశ్చ‌ర్య‌పోవ‌డమే కాకుండా షాక్‌కు గుర‌య్యారు. అదేవిధంగా అత‌ను ఒంట‌రిగానే గ‌డ‌పడానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతాడు. చాలాకాలం అత‌ను సొరంగంలోనే జీవించాడ‌ని స‌మాచారం. అయితే అత‌ని విచిత్ర జీవ‌న శైలిని చూసి ఆశ‌ర్య‌పోయిన దేజ్‌గా గ్రామ‌స్తులు ఆ వృద్ధుడి కోసం ఓ పూరి గుడిసెను కూడా నిర్మించార‌ట‌.

కాగా టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సంబంధించిన పారాసిటాల‌జీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ ఆ వృద్ధునికి వైద్య ప‌రీక్ష‌లు  చేసారు. అయితే అత‌ను 67 ఏండ్ల కాలం నుంచి స్నానం చేయ‌కుండా ఉన్నప్ప‌టికీ అత‌ని శ‌రీరంలో ఎలాంటి పరాన్న జీవులు, బ్యాక్టీరియాలు లేవు అని అత‌ను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని తేల్చారు.  అయితే ఆ వృద్ధునికి  స్థానిక ప‌రిపాల‌నాధికారులు సైతం అండ‌గా నిలిచారు. మ‌రొక విశేష‌మేమిటంలే అత‌నినీ ఎవ్వ‌రూ కూడా ఇబ్బంది పెట్ట‌వ‌ద్దంటూ అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ సైతం స్వ‌యంగా ప్ర‌జ‌ల‌ను కోర‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విశేషం. ఆ ఐర‌న్ మ్యాన్‌కు ప్ర‌భుత్వం కూడా ఎంత గౌర‌వం ఇస్తుందో తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: