అత్త మామలు అంటే కొంతమంది మంచిగా ఉంటారు. మరికొంతమంది మాత్రం అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తూ ఉంటారు. అందులో భాగంగా గృహహింస కేసులు కూడా పెరుగుతూన్నాయని అందరి కి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం అత్త మామల పై గౌరవాన్ని పెంచింది. కొడుకు కు పెళ్ళయిన ఆరు నెలలకే చనిపొయారు. ఆ తర్వాత కోడలిని పుట్టింటికి పంపించకుండా వాళ్ళే తల్లి దండ్రులుగా మారారు. ఆమెను చదివించి, ఉద్యోగం వచ్చేలా చేసి చివరికి పెళ్ళి కూడా చేశారు. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..


అమ్మాయి వారిని వదిలి వెళ్ళిపోతుంటే కంటతడి పెట్టింది. ఈ ఘటన అందరినీ కదిలించింది. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు.. దాంతో కోడలు ఒంటరి అయిపోయింది. ఇక చెసెదెమి లేక పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు. ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల చదివించారు.


అలా ఆమె బాగా చదివి జూనియర్ లెక్చరర్ అయ్యింది.సునీత్ జీవితం లో స్థిరపడడం తో ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యాలని కమలా దేవి, దిలావర్ నిర్ణయించుకున్నారు. వరుడి కోసం అన్వేషణ ప్రారంభించి ఆడిటర్ ముఖేష్‌ తో సునీత కు పెళ్లి నిర్ణయించారు. రెండు రోజులు క్రితం ఆమెకు ఒక వ్యక్తికి పెళ్ళి జరిపించారు. అత్త మామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతుల పై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: