సాధారణంగా లైవ్లో రిపోర్టింగ్ చేయాలి అని ఎంతోమంది కలగంటూ ఉంటారు. ఆ అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లైవ్ లో రిపోర్టింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్లు కాస్త రిస్కు చేసి ప్రమాదకర ప్రాంతాలకు సైతం వెళ్లి అందిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు రిపోర్టర్లు ప్రమాదానికి కూడా గురవుతూ ఉంటారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అటు ఎంతోమంది తమ రిపోర్టింగ్ మాత్రం ఆపరు.




 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆమె లైవ్లో రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఏకంగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో మైక్ పట్టుకుని లైవ్ లో మాట్లాడుతున్న ఆ రిపోర్టర్ ఒక్కసారిగా కిందపడిపోయింది. అయినప్పటికీ ఇక అక్కడ ఉన్న పరిస్థితులను మాత్రం వివరిస్తూనే  ఉంది ఆ మహిళా రిపోర్టర్. తనకు ఏం కాలేదు దెబ్బలు తగలలేదు అని చెబుతూనే మళ్ళీ లేచి నిలబడి పని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. దీంతో రిపోర్టర్ గా పని  పట్ల సదరు మహిళకు ఉన్నా అంకితభావానికి అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇలా లైవ్ లో రిపోర్టింగ్  ఇస్తుండగా యాక్సిడెంట్ జరిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ వీడియో చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. అమెరికా లోని వెస్ట్ వర్జీనియా లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ న్యూస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉండగా మహిళా రిపోర్టర్ లైవ్ లో పరిస్థితులు అన్నింటిని కూడా వివరిస్తుంది. ఇంతలో వెనుకనుంచి వచ్చిన ఒక కారు ఆమెను ఢీ కొట్టింది. దీంతో గట్టిగా అరిచిన మహిళా రిపోర్టర్ కిందపడిపోయింది. అయినప్పటికీ ఎక్కడ భయపడకుండా మళ్ళీ లేచి రిపోర్టింగ్ చేయడం మొదలు పెట్టింది సదరు మహిళ. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న టీం అందరూ కూడా మీరు ఓకేనా అని అడిగితే.. నేను బాగానే ఉన్నాను కెమెరాలు ఆపొద్దు అంటూ మహిళా రిపోర్టర్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: