బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ త‌న వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటున్న‌ది. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో అయితే ఇక చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. వ్యాక్సిన్లు, మాస్క్‌లు, లాక్‌డౌన్‌ను వ్య‌తిరేకిస్తున్న కెన‌డియ‌న్ ట్ర‌క్ డ్రైవ‌ర్ల నిర‌స‌న‌ల‌పై కంగ‌నా త‌న వాయిస్‌ను వినిపించిన‌ది. ముఖ్యంగా కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిస్ ట్రూడో త‌న కుటుంబంతో ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఉన్నారు. ఈ విష‌య‌ముపై న‌టి కంగ‌నా ర‌నౌత్ త‌న ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ ను చేసారు. కంగ‌నా ఈ పోస్టుల‌లో కెన‌డియ‌న్ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడోపై విరుచుకుప‌డినది.

2020 సంవ‌త్స‌రంలో భార‌త ప్రభుత్వాన్ని వ్య‌తిరేకిస్తూ ఉన్న రైతుల‌కు ట్రూడో మ‌ద్దతును ఇచ్చాడ‌నే విష‌యాన్ని ఆమె గుర్తుకు చేసిన‌ది. కెన‌డా ప్ర‌ధాని ట్రూడో భార‌తీయ నిర‌స‌న‌కారుల‌ను ప్రోత్స‌హిస్తూ ఉన్నాడు. ఇప్పుడు త‌న దేశంలో ర‌హ‌స్య ప్ర‌దేశంలో దాచుకున్నాడ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎందుకు అంటే నిర‌స‌న‌కారులు వారి భ‌ద్ర‌త‌కు ముప్పుగా ఉన్నారని.. ఎవ‌రి క‌ర్మ‌కు వారే బాధ్యులు అని వెల్ల‌డించింది. అదేవిధంగా 2020 సంవ‌త్స‌రంలో జ‌స్టిన్ ట్రూఐడో భార‌త‌దేశంలో రైతుల నిర‌స‌న‌కు త‌న మ‌ద్ద‌తును అందించాడు. రైతుల నిర‌స‌న గురించి భార‌త‌దేశం నుంచి వ‌స్తున్న వార్త‌ల‌పై నేను మాట్లాడాలి. ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉన్న‌ది.  కుటుంబం స్నేహితుల కోసం ఆందోళ‌న ఆందోళ‌న చెందుతున్నాం.

మాలో చాలా మందికి ఇది వాస్త‌వం అని మాకు తెలుసు శాంతియుతంగా నిర‌స‌నకారుల‌కు హ‌క్కుల‌ను కాపాడేందుకు కెన‌డా ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటుంద‌ని మేము అనేక మార్గాల ద్వారా భార‌త అధికారుల‌ను సంప్ర‌దించాం మ‌న‌మంద‌రం ఒక్క‌తాటిపైకి రావాల్సిన త‌రుణం ఇది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ట్రూడో ప్ర‌భుత్వం ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌కు  క‌రోనా టీకాలను వేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసిన‌ది. దీంతో డ్రైవ‌ర్లు నిర‌స‌న‌లు ప్రారంభించారు. నిర‌స‌న‌కారులు ఈ నిబంధ‌న‌ల‌ను ఫాసిజంతోనే పోల్చారు. మరోవైపు కంగ‌నాపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రూ ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: