ఇటీవలకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వ్యాయామం చేయాలి అంటే సమయం కేటాయించడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇంట్లోనే వాకింగ్ చేసే మెషిన్ ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది. అయితే సంపన్నులు అయితే ఇలా అనుకోగానే అలా తెచ్చుకుంటారు కాని సామాన్యులు ఎక్కువ మొత్తంలో వెచ్చించి ఇలా వాకింగ్ చేసే మిషన్ తెచ్చుకోవడం దాదాపు కష్టం అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక తమ అవసరాలను తీర్చుకునేందుకు కొంతమంది సామాన్య ప్రజలు వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉండటం మాత్రం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.


 ఏకంగా వేలకు వేల రూపాయలు పెట్టి జిమ్ లో ఉండే లాంటి వస్తువులను కొనుగోలు చేయడం కాదు మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే సరి కొత్త గా ఆలోచిస్తే ఏదైనా తయారు చేయవచ్చు అని నిరూపిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. సాధారణంగా ఇంట్లోనే వాకింగ్ జాగింగ్ రన్నింగ్ చేసే వెసులుబాటును ట్రెడ్మిల్ అందిస్తున్నాయి. ఇక ఈ ట్రేడ్ మిల్ లో మోటార్ కన్వేయర్, బెల్ట్ ప్లాట్ ఫామ్, డిజిటల్ కంట్రోల్ వంటి విభాగాలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడి ట్రెడ్మిల్ నడవాలి అంటే తప్పనిసరిగా పవర్ అవసరం ఉంటుంది. ఇక వీటి ధర రూ 15 వేల నుంచి 70 వేల వరకు ఉంటాయి.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం సరికొత్త ఆలోచన చేసి ఏకంగా చెక్కలతో ట్రెడ్మిల్ రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ గా మారిపోతుంది. ఈ వుడెన్ ట్రెడ్మిల్ అచ్చం యాంత్రిక ట్రెడ్మిల్ లాగానే పనిచేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాదండోయ్ ఇక ఈ ట్రెడ్మిల్ నడిచేందుకు ఎలాంటి పవర్ కూడా అవసరం లేకపోవడం విశేషం అనే చెప్పాలి. ఈ వీడియో ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసిన కేటీఆర్ ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  వ్యక్తి వివరాలు తెలుసుకోవాలి అంటూ తెలంగాణ నూతన ఆవిష్కరణలకు ఔత్సాహిక విభాగం వారికి సూచించారు ఆయన..

మరింత సమాచారం తెలుసుకోండి: