మంచి పని చేయాలి అంటే డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది అనుకుంటే సరిపోదు.కాస్త మానవత్వంతో ఆలొచిస్తే చాలు వాళ్ళు నిజంగానే గ్రేట్ అవుతారు.. ఇలాంటి వాళ్ళు ఈరోజుల్లో తక్కువగా కనిపిస్తారు..ఎందుకంటే ఎవరి స్వార్దానికి వాళ్ళు ఉంటున్నారు.ఎంత సేపు డబ్బులను సంపాదించుకోవడం కోసం విస్వ ప్రయత్నాలు చేస్తారు.కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఎవరూ అనుకోరు.. సమాజం అలా తయారైంది. ఇలాంటి రోజుల్లో కూడా ఓ వృద్ధురాలు వందల మంది ప్రాణాలును కాపాడింది..


ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.. 65 ఏళ్ల వృద్ధురాలు రైలు పట్టాలు విరిగి పొయాయని తెలుసుకుంది. ఎవరికీ చెప్పలేక నిస్సహాయంగా ఉంది. అయితే పక్కనే వున్న ఒక చెట్టు కొమ్మను తీసుకొచ్చి విరిగిన చోట అడ్డుగా వేసింది. తర్వాత తన ఎర్ర చీరను తీసి రైలును ఆపే ప్రయత్నం చేసింది. అది గమనించిన రైలు సిబ్బంది రైలును ఆపారు. అసలు విషయం తెలుసుకొని పై అధికారులకు సమాచారం అందించారు. ఆమె చేసిన పనికి అందరూ సెల్యూట్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది..


వివరాల్లొకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన వెలుగు చూసింది.ఎటా జిల్లా అవాగఢ్ మండలం గులేరియా గ్రామంలో ఓంవతీ దేవి అనే మహిళ నివాసం ఉంటుంది. గురువారం రైల్వే ట్రాక్ పక్కనుంచి పొలం పనులకు వెళ్తుంది. దాని పై రైలు వెళితే ప్రమాదం జరుగుతుందని గ్రహించిన ఆమెకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. ట్రైన్ వచ్చే వేళ అయ్యిందని భావించిన వృద్ధ మహిళ ఎంతో తెలివిగా ఆలోచించింది.పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది. ఇంతలోనే ఎటా నుంచి టుండ్లా వెళ్తున్న పాసింజర్ ట్రైన్ వచ్చింది.అది చూసిన డ్రైవర్ వెంటనే రైలును ఆపెసారు. ఆమె వందల మంది ప్రాణాలును కాపాడిందని గ్రామస్తుల తో పాటుగా, ప్రజలు అందరూ కూడా ఆమెను ప్రసింషించారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె చేసిన పనికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: